Begin typing your search above and press return to search.

చైనాలో 'క్లీన్ ప్లేట్ క్యాంపేన్‌' షురూ ..మండిపడుతున్న చైనీయులు !

By:  Tupaki Desk   |   13 Aug 2020 2:30 PM GMT
చైనాలో క్లీన్ ప్లేట్ క్యాంపేన్‌ షురూ ..మండిపడుతున్న చైనీయులు !
X
కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం పోరాటం చేస్తుందని , ఈ సమయంలో ఆహారాన్ని వృధా చేయడం అసలు మంచి పద్దతి కాదు అని , ఎట్టి పరిస్థితుల్లో ఆహారాన్ని వృధా చేయకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్తూ క్లీన్ ప్లేట్ క్యాంపేన్ ను చైనా అధ్యక్షుడు జీ జింగ్ పింగ్ ప్రారంభించారు. అయితే , ఆ క్యాంపేన్ ను ఇప్పుడు క్యాష్ చేసుకుంటున్నాయి అక్కడి రెస్టారెంట్స్ , హోటల్స్. అదేలా అని ఆలోచిస్తున్నారా ! రెస్టారెంట్ కు 10మంది కష్టమర్లు వచ్చి, తినటానికి ఫుడ్ ఆర్డర్ చేస్తే 9మందికి సరిపడా మాత్రమే వడ్డిస్తున్నారు. ఇదేంటి అని అడిగితే,ఆహారం పొదుపుగా వినియోగించాలని వృధా కాకుండా జాగ్రత్తగా ఉండాలని మన అధ్యక్షడు ఇచ్చిన పిలుపు గురించి మీరు తెలుసుకోలేదా అని చెప్తున్నారట. దీనితో , ఈ క్యాంపేన్ కు వ్యతిరేకంగా ఆన్ లైన్ లలో విమర్శలు వస్తున్నాయి.

పూర్తి వివరాలు చూస్తే .. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆహారం వృధా అవుతున్న తీరు బాధాకరమని, ఇది మంచిది కాదు అని, అసలే కరోనా కష్టకాలంలో ఆహారాన్ని వృథా చేస్తే ఆహార భద్రత సంక్షోభం వచ్చే అవకాశం ఉందని, దీనితో ప్రతీ ఒక్కరూ ఆహారాన్ని వృథా చేయకూడదు అని పిలుపునిచ్చారు. ఈ నేప‌థ్యంలో చైనాలో ‘‘క్లీన్ ప్లేట్ క్యాంపేన్‌’’ను జీ జిన్‌పింగ్ ప్రారంభించారు. కరోనాతో ఆహారం వృదా పై అప్ర‌మ‌త్తం కావాల్సి వ‌స్తుంద‌ని..ఆహార భ‌ద్ర‌త సంక్షోభం రాకుండా చూసేందుకు జాగ్రత్తలు పాటించాలని కోరారు. చైనా దేశ‌వ్యాప్తంగా భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ద‌క్షిణ చైనాలో వ‌రద‌లు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి, దీనితో చాలా పంట నాశనం అయింది. చైనా ఆహార వ్యతిరేక వ్యర్థాల ప్రచారాన్ని ప్రారంభించడం ఇదే మొదటిసారి కాదు. 2013 లో, “ఆపరేషన్ ఖాళీ ప్లేట్” ప్రచారం జరిగింది. అయితే అప్పుడు కేవ‌లం భారీ భారీ విందుల‌ను మాత్ర‌మే టార్గెట్ చేస్తూ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేశారు.

అధినేత జీ జిన్ ‌పింగ్ ఇచ్చిన పిలుపుతో.. వుహాన్ క్యాటరింగ్ ప‌రిశ్ర‌మ సంఘం ఓ నిర్ణ‌యం తీసుకుంది. అదేమిటంటే, తమ రెస్టారెంట్ల‌కు వ‌చ్చిన వారికి ఒక డిష్‌ను త‌క్కువ‌గా స‌ర్వ్ చేయాల‌ని గుంపుగా రెస్టారెంట్ల‌కు వెళ్లేవారు, ఒక డిష్‌ను త‌క్కువ‌గా ఆర్డ‌ర్ చేయాల‌న్న సంకేతాల‌ను జారీ చేశారు. అంటే దీన్ని బట్టి .. పది మంది వెళ్తే 9 మందికి సరిపడా ఫుడ్ ఆర్డర్ చేయాలి. దీనిపై కొందరు చైనీయులు మండిపడుతున్నారు. అలాగే ఒకవేల ఒక్కరే తినడానికి వెళ్తే ఎన్ని ప్లేట్లు .. జీరో ప్లేట్లు ఆర్డర్ ఇవ్వాలా అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.