Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ వేసుకోని వారికి ఆ దేశం దిమ్మ తిరిగేలా షాకిచ్చింది

By:  Tupaki Desk   |   3 Dec 2021 5:33 AM GMT
వ్యాక్సిన్ వేసుకోని వారికి ఆ దేశం దిమ్మ తిరిగేలా షాకిచ్చింది
X
కరోనా కారణంగా యావత్ ప్రపంచం ఎంతలా ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే. అయినప్పటికి కొందరి మూర్ఖత్వం మాత్రం విస్మయానికి గురి చేస్తూ ఉంటుంది. కరోనా వ్యాక్సిన్ వేసుకోవటానికి ససేమిరా అనే వారు మన దేశంలోనే కాదు.. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఉన్నారు. లేనిపోని భయాలు.. అంతకు మించిన అనుమానాలతో వారు ప్రమాదంలో ఉండటమే కాదు.. తమ తోటి ప్రజల్ని కూడా ప్రమాదాల్లోకి నెడుతున్న ఇలాంటి వారి తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే.

ఇలాంటి వారిని దారికి తెచ్చేందుకు తాజాగా జర్మనీ ప్రభుత్వం కఠిన నిబంధనను తీసుకొచ్చింది. ఇప్పటివరకు వెలుగు చూసిన కరోనా వేరియంట్లకు భిన్నంగా ఒమిక్రానో వేరియంట్ ఇబ్బందులకు గురి చేస్తుందన్న వార్తల నేపథ్యంలో జర్మనీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తాజాగా ఆ దేశ ఛాన్సలర్ యాంజెలా మార్కెల్ సరికొత్త ఆదేశాల్ని జారీ చేశారు. దీని ప్రకారం.. వ్యాక్సిన్ వేసుకోని వాళ్లు.. తమ ఇళ్ల్ల్లల్లో నుంచి బయటకు రాని రీతిలో వారిపై ‘లాక్ డౌన్’ ఆంక్షల్ని విధించింది.

కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారు బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లటాన్ని నిషేధిస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. షాపింగ్ మాల్స్.. ఇతర వినోద కార్యక్రమాలకు వెళ్లేందుకు వారికి అనుమతి లేదు. అంతేకాదు.. అత్యవసరాల కోసం సూపర్ మార్కెట్లు.. మెడికల్ షాపులకు వెళ్లేందుకు మాత్రమే టీకాలు వేసుకోని వారికి అనుమతి ఇస్తున్నారు.

అంతేకాదు.. ప్రజలంతా టీకాలు వేసుకోవాలన్న నిర్ణయాన్ని కఠినంగా అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ తాజా ప్రతిపాదన జర్మనీ పార్లమెంటులో ఆమోదం పొందితే.. నిర్బంద టీకా కార్యక్రమం ఫిబ్రవరి నుంచి అమల్లోకి రానుంది. ఇదే రీతిలో.. మన దేశంలోనూ టీకాలు వేసుకోని వారి విషయంలో కఠిన ఆంక్షల్ని విధించాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. మరి.. మన పాలకులు ఏం చేస్తారో చూడాలి.