Begin typing your search above and press return to search.

కొత్త జిల్లాల పై జగన్ సర్కారు విడుదల చేసిన గెజిట్ లో ఏముంది?

By:  Tupaki Desk   |   27 Jan 2022 3:51 AM GMT
కొత్త జిల్లాల పై జగన్ సర్కారు విడుదల చేసిన గెజిట్ లో ఏముంది?
X
కొత్త జిల్లాలపై ఏపీ ప్రజలకు తానిచ్చిన మాటను తాజాగా ఆచరణలోకి తీసుకొచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి ఎన్నో నెలలుగా కొత్త జిల్లాలకు సంబంధించిన వివరాలు బయటకు వస్తున్నా.. వాటికి సంబంధించిన ఏ వివరాలు బయటకు వచ్చింది లేదు. కొత్త జిల్లాల ప్రకటన ఎప్పుడు ఉంటుందన్న విషయంపై ఏపీ సర్కారు అధికారిక ప్రకటన చేసింది లేదు. అందుకు భిన్నంగా అర్థరాత్రి వేళలో అనూహ్యంగా తెర మీదకు తీసుకొచ్చేసిన ఏపీ సర్కారు.. కొత్త జిల్లాలపై ఇప్పటివరకు వచ్చిన అంచనాలకు తగ్గట్లే గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.

ఇప్పటికే ఉన్న 13 జిల్లాల స్థానే 26 జిల్లాల్ని ఏర్పాటు చేయటం.. కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేస్తూ సమగ్ర కార్యాచరణను ప్రకటించింది. అంతేకాదు.. ఈ కొత్త జిల్లాలకు సంబంధించిన ఏదైనా అభ్యంతరాలు ఉంటే.. ఫిబ్రవరి 26 వరకు అభిప్రాయాల్నిస్వీకరిస్తుందని వెల్లడించారు. తెలుగు వారికి కొత్త సంవత్సరమైన ఉగాది నుంచి కొత్త జిల్లాల్ని అధికారంగా అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంతకూ.. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ లో ఏముంది? అన్నది చూస్తే..

కొత్త జిల్లాలు ఇవే..

1. పార్వతీపురం జిల్లా కేంద్రంగా మన్యం జిల్లా

2. పాడేరు జిల్లా కేంద్రంగా అల్లూరి సీతామరాజు జిల్లా

3. అనకాపల్లి జిల్లా కేంద్రంగా అనకాపల్లి జిల్లా

4. కాకినాడ జిల్లా కేంద్రంగా కాకినాడ జిల్లా

5. అమలాపురం జిల్లా కేంద్రంగా కోనసీమ జిల్లా

6. భీమవరం జిల్లాకేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా

7. ఏలూరు జిల్లాకేంద్రంగా ఏలూరు జిల్లా

8. మచిలీపట్నం జిల్లాకేంద్రంగా మచిలీపట్నం జిల్లా

9. విజయవాడ జిల్లాకేంద్రంగా ఎన్టీఆర్‌ కృష్ణా జిల్లా

10. నర్సరావుపేట జిల్లాకేంద్రంగా పల్నాడు జిల్లా

11. బాపట్ల జిల్లాకేంద్రంగా బాపట్ల జిల్లా

12. పుట్టపర్తి జిల్లాకేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా

13. రాయచోటి జిల్లాకేంద్రంగా అన్నమయ్య జిల్లా

14. తిరుపతి జిల్లా కేంద్రంగా శ్రీబాలాజీ జిల్లా

15. నంద్యాల జిల్లా కేంద్రంగా నంద్యాల జిల్లా

26 జిల్లాల పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవే..

1. విజయనగరం
నియోజకవర్గాలు: రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, ఎస్‌కోట, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం

2. విశాఖ
నియోజకవర్గాలు: నార్త్‌ విశాఖ, సౌత్‌ విశాఖ, గాజువాక

3. అనకాపల్లి
నియోజకవర్గాలు: చోడవరం, మాడుగుల, పాయకరావుపేట, ఎలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం

4. అరకు
నియోజకవర్గాలు: పాడేరు, అరకు, రంపచోడవరం

5. పార్వతీపురం
నియోజకవర్గాలు: పాలకొండ, కురుపాం, సాలూరు, పార్వతీపురం

6. శ్రీకాకుళం

నియోజకవర్గాలు: పలాస, టెక్కలి, పాతపట్నం, ఎచ్చెర్ల, ఆముదాలవలస, నరసన్నపేట, శ్రీకాకుళం

7. కాకినాడ
నియోజకవర్గాలు: తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ సిటీ, జగ్గంపేట,
పెద్దాపురం

8. రాజమహేంద్రవరం
నియోజకవర్గాలు: రాజమండ్రి సిటీ, రూరల్‌, అనపర్తి, రాజానగరం, కొవ్వూరు, నిడదవోలు,
గోపాలపురం

9. అమలాపురం
నియోజకవర్గాలు: రాజోలు, కొత్తపేట, రామచంద్రాపురం, పి.గన్నవరం, ముమ్మడివరం, మండపేట, అమలాపురం

10. ఏలూరు
నియోజకవర్గాలు: దెందులూరు, చింతలపూడి, కైకలూరు, ఏలూరు, ఉంగుటూరు, పోలవరం,
నూజివీడు

11. నరసాపురం
నియోజకవర్గాలు: పాలకొల్లు, ఉండి, ఆచంట, తాడేపల్లిగూడెం, నరసాపురం, తణుకు, భీమవరం

12. మచిలీపట్నం
నియోజకవర్గాలు: పెడన, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, మచిలీపట్నం, పెనుమలూరు, గన్నవరం, గుడివాడ

13. విజయవాడ
నియోజకవర్గాలు: విజయవాడ ఈస్ట్‌, వెస్ట్‌, సెంట్రల్‌, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు

14. బాపట్ల
నియోజకవర్గాలు: వేమూరు, రేపల్లె, చీరాల, బాపట్ల, పర్చూరు, అద్దంకి

15. నరసరావుపేట
నియోజకవర్గాలు: సత్తెనపల్లి, పెదకూరపాడు, మాచర్ల, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ

16. గుంటూరు
నియోజకవర్గాలు: గుంటూరు ఈస్ట్, వెస్ట్‌, పత్తిపాడు, పొన్నూరు, తెనాలి, మంగళగిరి, తాడికొండ

17. ఒంగోలు
నియోజకవర్గాలు: సంతనూతలపాడు, దర్శి, కనిగిరి, ఒంగోలు, మార్కాపురం, ఎర్రగొండపాలెం

18. నెల్లూరు
నియోజకవర్గాలు: నెల్లూరు సిటీ, రూరల్‌, కొవ్వూరు, కావలి, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు

19. తిరుపతి
నియోజకవర్గాలు: శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, చంద్రగిరి, తిరుపతి

20. చిత్తూరు
నియోజకవర్గాలు: పుంగనూరు, పలమనేరు, నగరి, చిత్తూరు, జీడీ నెల్లూరు, పూతలపట్టు

21. కడప
నియోజకవర్గాలు: కమలాపురం, జమ్మలమడుగు, బద్వేల్‌, కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, మైదుకూరు

22. రాజంపేట
నియోజకవర్గాలు: తంబళ్లపల్లి, మదనపల్లి, రాయచోటి, పీలేరు, రాజంపేట, రైల్వేకోడూరు

23. నంద్యాల
నియోజకవర్గాలు: ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్‌, నంద్యాల, నందికొట్కూరు, శ్రీశైలం

24. కర్నూలు
నియోజకవర్గాలు: పాణ్యం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ

25. హిందూపురం
నియోజకవర్గాలు: కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, హిందూపురం, పెనుగొండ, మడకశిర

26. అనంతపురం
నియోజకవర్గాలు: రాప్తాడు, తాడిపత్రి, సింగనమల, గుంతకల్లు, అనంతపురం, అర్బన్‌, కల్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ

కొత్త జిల్లాల పరిధిలో ఉండే రెవెన్యూ డివిజన్లు

1. శ్రీకాకుళం
రెవెన్యూ డివిజన్లు: టెక్కలి, శ్రీకాకుళం

2. విజయనగరం
రెవెన్యూ డివిజన్లు: బొబ్బిలి, విజయనగరం

3. మన్యం
రెవెన్యూ డివిజన్లు: పాలకొండ, పార్వతీపురం

4. అల్లూరి సీతారామరాజు
రెవెన్యూ డివిజన్లు: పాడేరు, రంపచోడవరం

5. విశాఖ
రెవెన్యూ డివిజన్లు: భీమునిపట్నం, విశాఖపట్నం

6. అనకాపల్లి
రెవెన్యూ డివిజన్లు: నర్సీపట్నం, అనకాపల్లి

7. తూర్పుగోదావరి
రెవెన్యూ డివిజన్లు: పెద్దాపురం, కాకినాడ

8. కోనసీమ
రెవెన్యూ డివిజన్లు: రామచంద్రాపురం, అమలాపురం

9. రాజమండ్రి
రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం, కొవ్వూరు

10. నరసాపురం
రెవెన్యూ డివిజన్లు: నరసాపురం, భీమవరం

11. పశ్చిమగోదావరి
రెవెన్యూ డివిజన్లు: ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు

12. మచిలీపట్నం
రెవెన్యూ డివిజన్లు: గుడివాడ, మచిలీపట్నం

13. ఎన్టీఆర్‌
రెవెన్యూ డివిజన్లు: విజయవాడ, నందిగామ, తిరువూరు

14. గుంటూరు
రెవెన్యూ డివిజన్లు: గుంటూరు, తెనాలి

15. బాపట్ల
రెవెన్యూ డివిజన్లు: బాపట్ల, చీరాల

16. పల్నాడు
రెవెన్యూ డివిజన్లు: గురజాల, నరసరావుపేట

17. ప్రకాశం
రెవెన్యూ డివిజన్లు: మార్కాపురం, ఒంగోలు, కనిగిరి

18. నెల్లూరు
రెవెన్యూ డివిజన్లు: నెల్లూరు, అత్మకూరు, కావలి

19. కర్నూలు
రెవెన్యూ డివిజన్లు: కర్నూలు, ఆదోని

20. నంద్యాల
రెవెన్యూ డివిజన్లు: నంద్యాల, డోన్‌, ఆత్మకూరు

21. అనంతపురం
రెవెన్యూ డివిజన్లు: కల్యాణదుర్గం, అనంతపురం, గుంతకల్లు

22. శ్రీసత్యసాయి
రెవెన్యూ డివిజన్లు: పెనుగొండ, పుట్టపర్తి, కదిరి

23. కడప
రెవెన్యూ డివిజన్లు: కడప, జమ్మలమడుగు, బద్వేల్‌

24. అన్నమయ్య
రెవెన్యూ డివిజన్లు: రాజంపేట, రాయచోటి, మదనపల్లి

25. చిత్తూరు
రెవెన్యూ డివిజన్లు: చిత్తూరు, పలమనేరు

26. శ్రీబాలాజీ
రెవెన్యూ డివిజన్లు: తిరుపతి, నాయుడుపేట, గూడూరు