Begin typing your search above and press return to search.

మరో ఎల్జీ పాలిమర్స్.. జనం ఉక్కిరిబిక్కిరి

By:  Tupaki Desk   |   7 Jun 2020 6:08 AM GMT
మరో ఎల్జీ పాలిమర్స్.. జనం ఉక్కిరిబిక్కిరి
X
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన మరువక ముందే మరో గ్యాస్ లీక్ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. విశాఖలో రెండు మూడు గ్రామాలనే మన గ్యాస్ లీక్ ఉక్కిరిబిక్కిరి చేయగా.. భారీ జనాభా దాదాపు 2 కోట్ల మంది ఉన్న దేశ ఆర్థిక రాజధానిలో ఓ ఫార్మా కంపెనీ నుంచి పెద్ద ఎత్తున గ్యాస్ లీక్ కావడంతో జనాలు భయపడిపోయారు. ఘాటు దుర్వాసనలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎల్జీ పాలిమర్స్ తరహాలోనే లీకైన ఈ గ్యాస్ తో ఐదు ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడింది

ముంబైలోని చెంబూర్ సమీపంలోని గోవండి (ఈస్ట్) ప్రాంతంలో గల యూఎస్ విటమిన్ ఫార్మా కంపెనీ నుంచి గ్యాస్ వెలువడినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.శనివారం రాత్రి 9.53 నిమిషాలకు గ్యాస్ లీక్ అయినట్లు పేర్కొన్నారు. దీని ప్రభావం ఐదు ప్రాంతాలపై తీవ్రంగా పడింది. ఘట్ కోపర్, పొవై, విక్రోలి, చెంబూర్, కంజూర్ మార్గ్ చాందీవలి ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఈ గ్యాస్ లీక్ తో ఇబ్బందులు పడ్డారు.

ఈ ఫార్మా కంపెనీలో మందులు, విటమిన్లను తయారు చేయడానికి పెద్ద ఎత్తున రసాయన పదార్థాలను వినియోగిస్తుంటారు. మందుల తయారీ కంపెనీ నుంచి గ్యాస్ వెలువడిందనే సమాచారంతో ప్రజలు ఆందోళకు గురయ్యారు. స్థానికులు పొరుగు ప్రాంతాలకు పరుగులు తీసి నిద్రలేని రాత్రి గడిపారు.

గ్యాస్ లీక్ తో ముంబై అధికారులు 17 బృందాలను అక్కడికి పంపి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే సమీక్షించారు. ఉన్నతాధికారుల బృందాన్ని సంఘటన స్థలానికి పంపారు. పరిస్థితులు అదుపులో ఉన్నాయని తెలిపారు.