Begin typing your search above and press return to search.

ఆరోపణలపై గంగూలీ స్ట్రాంగ్ కౌంటర్​

By:  Tupaki Desk   |   29 Sep 2020 10:10 AM GMT
ఆరోపణలపై గంగూలీ స్ట్రాంగ్  కౌంటర్​
X
‘నేను మాజీ క్రికెటర్​ ను, భారత జట్టుకు కెప్టెన్​ గా కూడా పనిచేశాను. ఆ అనుభవంతో ఎవరికైనా సలహాలు ఇస్తే తప్పేంటి? అనవసరంగా నా మీద నోరు పారేసుకోకండి.. అంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ పేర్కొన్నారు. 500 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన తాను ఏ ఆటగాడితోనైనా మాట్లాడతానని పేర్కొన్నారు. తనకు శ్రేయాస్​ అయ్యర్​ అయినా.. కెప్టెన్ న్​ విరాట్​ కోహ్లీ అయిన ఒక్కటే అని వివరణ ఇచ్చారు.

గంగూలీ మీద వచ్చిన ఆరోపణలు ఏమిటి?

ఐపీఎల్​ టోర్నీకి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్​ ఓ ప్రైవేట్​ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ జట్టుకు మెంటార్​ గా పని చేసిన సౌరవ్​ గంగూలీ , రికీ పాంటింగ్​ తమకు ఎన్నో విలువైన సలహాలు ఇచ్చారని.. వారి సలహాలతోనే తాను రాణించానని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్​ మీడియా లో తీవ్ర దుమారం రేపాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్​ గంగూలీ ఐపీఎల్​ లోని ఓ జట్టుకు సలహాలు ఇవ్వడమేమిటని పలువురు సోషల్​ మీడియాలో కామెంట్లు చేశారు.

దీంతో ఈ వివాదంపై గంగూలీ స్పందించారు.. ‘గత ఏడాది ఐపీఎల్‌లో నేను ఢిల్లీ జట్టుకు మెంటార్‌గా ఉన్నాను. అప్పుడు కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌కు అండగా నిలిచాను. ఇప్పుడు నేను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండవచ్చు. బీసీసీఐ అధ్యక్షుడిని కాగానే మెంటార్​ పదవికి రాజీనామా చేశా. అయితే 500 మ్యాచ్​లు ఆడిన క్రికెటర్​గా యువ క్రికెటర్లకు సలహాలు ఇస్తే తప్పేంటి.. అది శ్రేయస్‌ అయ్యర్‌ కావొచ్చు లేదా విరాట్ కోహ్లీ అవ్వొచ్చు. వారికి నా సలహాలు కావాలంటే కచ్చితంగా ఇస్తాను' అని సౌరవ్‌ గంగూలీ తెలిపారు.

భారత్‌ లోనే జరిపేందుకు ప్రయత్నిస్తాం:
జనవరి, ఫిబ్రవరి లో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరగాల్సిన సిరీస్‌ను స్వదేశంలోనే నిర్వహించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని సౌరవ్‌ తెలిపారు. 'భారత గడ్డపై సిరీస్ జరిపేందుకే మా తొలి ప్రాధాన్యత. అందు కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తాం. యూఏఈ తరహా లో మన నగరాల్లోని మైదానాల్లో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి.