Begin typing your search above and press return to search.

పుట్టినరోజు వేడుక్కి పిలిచిన లేడీ పోలీస్ పై గ్యాంగ్ రేప్

By:  Tupaki Desk   |   26 Sep 2021 6:30 AM GMT
పుట్టినరోజు వేడుక్కి పిలిచిన లేడీ పోలీస్ పై గ్యాంగ్ రేప్
X
దారుణం చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో తరచూ చోటు చేసుకుంటున్న అత్యాచారాల పరంపరలో మరొకటి నమోదైంది. అయితే.. ఈ ఉదంతంలో బాధితురాలు పోలీస్ కానిస్టేబుల్ కావటం గమనార్హం. నేరాన్ని గుర్తించే తత్త్వం పోలీసుల్లో ఎక్కువ. కానీ.. స్నేహాన్ని నమ్మిన పాపానికి ఈ లేడీ కానిస్టేబుల్ దారుణానికి గురి కావాల్సి వచ్చింది. సంచలనంగా మారిన ఈ ఉదంతం మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. పోలీసులు.. స్థానికులు అందిస్తున్న సమాచారం ఆధారంగా చూసినప్పుడు.. 30 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ ను ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి.. దానికి సంబంధించిన వీడియో తీసి.. బెదిరింపులకు దిగుతున్నట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందింది.

వాస్తవానికి ఈ దారుణం సెప్టెంబరు మొదటి వారంలో జరిగినా.. కాస్త ఆలస్యంగా పోలీసులకు బాధితురాలు సమాచారం అందించారు. ఈ ఉదంతంలో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. అరెస్టు అయిన నిందితుల్లో ప్రధాన నిందితుడి తల్లి కూడా ఉండటం గమనార్హం. ఇంతకీ.. ఇలాంటి పరిస్థితి సదరు మహిళా కానిస్టేబుల్ కు ఎలా ఎదురైందన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. కొత్త విషయాలు బయటకు వచ్చాయి.

ప్రధాన నిందితుడు ఫేస్ బుక్ వేదికగా బాధితురాలితో స్నేహం చేశాడు. దాదాపు ఏడాదికి పైనే వారి స్నేహం సాగుతోంది. ఈ ఏప్రిల్ నుంచి వాట్సాప్ నెంబర్లు ఇచ్చుకొని మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో తన తమ్ముడి పుట్టిన రోజు వేడుకకు రావాలని బాధితురాలిని ఆహ్వానించాడు. అనంతరం పోలీస్ కానిస్టేబుల్ పై ముగ్గురు అత్యాచారం చేశారు. ప్రధాన నిందితుడు.. అతని సోదరుడితో పాటు.. పార్టీకి హాజరైన మరొకరు కూడా ఈ దారుణానికి పాల్పడగా.. అత్యాచారం తర్వాత ప్రధాన నిందితుడి తల్లి తనను బెదిరింపులకు గురి చేస్తోందని.. తనను చంపేస్తామని వార్నింగ్ ఇస్తున్నట్లు కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఈ ఉదంతాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకొని విచారణ జరుపుతున్నారు.