యువతిపై ఆస్పత్రిలో డాక్టర్ల గ్యాంగ్ రేప్

Fri Jun 11 2021 07:00:01 GMT+0530 (IST)

Gang rape of doctors in hospital

అనారోగ్యంతో అసహాయ స్థితిలో ఆస్పత్రిలో చేరిన యువతి మీద డాక్టర్లు సామూహిక అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. ఆపరేషన్ థియేటర్ లో తన మీద డాక్టర్లు గ్యాంగ్ రేప్ చేశారని బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పింది. అత్యాచారానికి గురైన యువతికి చికిత్స అందించినా ఆమె ప్రాణాలు దక్కలేదు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.ఉత్తరప్రదేశ్ లో ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లే రోగిగా ఆస్పత్రిలో చేరిన యువతిపై గ్యాంగ్ రేప్ చేసి చావుకు కారణమయ్యారు. ప్రయాగ్ రాజ్ జిల్లాలోని మీర్జాపూర్ లో నివాసం ఉంటున్న యువతి మే 29వ తేదీన అనారోగ్యంతో ఎస్ఆర్ఎన్ ఆస్పత్రిలో చేరింది. ఆమెకు ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆ యువతి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది.

జూన్ 1న ఆస్పత్రిలోని ఆపరేష్ థియేటర్ కు తీసుకెళ్లిన వైద్యులు అక్కడ తనపై సామూహిక అత్యాచారం చేశారని ఆమె సోదరుడికి చెప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని బాధితురాలి వద్ద స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు.కేసు విచారణ జరుగుతున్న సమయంలో బాధితురాలికి చికిత్స విఫలమై మరణించింది. ఇంకా ఆ డాక్టర్లను అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.