3 బుల్లెట్లు దిగాక మహాత్మా గాంధీజీ ఆ 15ని.లు?!

Tue Jan 24 2023 10:25:37 GMT+0530 (India Standard Time)

Gandhi Was Alive After Shooting 3 Bullets

భారతదేశం స్వాతంత్య్రం సాధించి ఆరు నెలలు కూడా కాలేదు. మహాత్మా గాంధీని నాథూరామ్ గాడ్సే హత్య చేసినప్పుడు.. విభజన తరువాత ఇప్పటికీ తీవ్రమైన మత హింస పరిస్థితులు మారనే లేదు. గాడ్సే ఒక రాడికల్ హిందువు.. అతను ముస్లింలను నిరంతరం స్థిరంగా పాండరింగ్ (నీతిలేని వారిగా అభివర్ణిస్తూ) చేస్తున్నందుకు  నిందలను ఎదుర్కొన్నాడు. పూనా (ప్రస్తుతం పూణే) నుండి ఒక బ్రాహ్మణుడు హిందూ మహాసభ సభ్యుడు అయిన గాడ్సే... గాంధీ 'చివరి ముస్లిం అనుకూల ఉపవాస ధీక్ష'తో  తాను కూడా రెచ్చిపోవడానికి కారకుడయ్యాడని పేర్కొన్నాడు. చివరికి నా ఉనికిని వెతుక్కోవాల్సిన పరిస్థితికి ఇది దారితీసిందని అన్నాడు. ''గాంధీని తక్షణం అంతం చేయాలి'' అని గాడ్సే భావించాడు. గాంధీజీ 13 జనవరి 1948న కొత్తగా ఏర్పాటైన భారత ప్రభుత్వం పాకిస్థాన్ కు చెల్లించాల్సిన డబ్బును విడుదల చేయాలని పట్టుబట్టి ఈ నిరాహార దీక్ష చేపట్టారు. అతను దానిని జనవరి 18న ముగించాడు.గాంధీ మరణాన్ని ప్రకటించిన 'ది హిందూ'లో ఒక కథనం ప్రకారం 'జాతి పితామహుడు'ని సాయంత్రం 5:12 గంటలకు తుపాకీతో కాల్చి చంపారు. అతను(గాంధీజీ) 15 నిమిషాల తర్వాత మరణించారు. గాంధీ ఢిల్లీలోని బిర్లా హౌస్ లో ఉన్నారు (తరువాత మ్యూజియంగా మార్చారు). సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే తన షెడ్యూల్ ప్రార్థన  సమావేశానికి వెళుతున్నారు.

గాంధీ తన సహచర ఆవా గాంధీ భుజాలపై వాలుతూ ప్రార్థన మండపం వద్దకు నడిచారు. మను గాంధీ అతని మనవడు .. మనుమరాలు తనతోనే వరుసలో ఉన్నారు. ఇదే వరుసలో గాడ్సే అతని వద్దకు వెళ్లి తల వంచి ''ఈ రోజు మీరు ప్రార్థనకు ఆలస్యం అయ్యారు'' అని చెప్పాడు. ''అవును.. నేనే'' అని గాంధీ బదులిచ్చే ఆ సమయంలో గాడ్సే గాంధీజీ (79) శరీరంలోకి మూడు బుల్లెట్లను కర్కశంగా దించాడు. దాదాపు లక్షలాది మంది గాంధీజీ అనుచరులతో పవిత్ర స్థలంగా పరిగణించబడే చోట ఈ ఘటన జరిగింది.

గాడ్సే ఎటాక్ కి ముందు ఐదు హత్యాప్రయత్నాల నుండి బయటపడిన గాంధీ రెండు రోజుల ముందు ఇలా అన్నారు. ''నేను పిచ్చివాడి బుల్లెట్ తో చనిపోవాలంటే.. నేను నవ్వుతూనే పోవాలి. దేవుడు నా హృదయంలో  నా పెదవులపై ఉండాలి. ఏదైనా జరిగితే మీ కంటి నుంచి ఒక్క కన్నీరు కూడా పడకూడదు'' అని తనపై జరగబోయే క్రతువును ముందే ఊహించారు. అప్పటికే ఐదు హత్యాయత్నాల నుంచి బయటపడి ఆరోసారి గాంధీజీ హత్యకు గురయ్యారు. ఆ అనుభవాలతోనే ఆయన అలా ఊహించారు కూడా.

హత్యానంతరం జవహర్ లాల్ నెహ్రూ రేడియో ఉపన్యాసంలో జాతిని ఉద్దేశించి ఇలా అన్నారు. ''మిత్రులారా.. సహచరులారా... మన జీవితాల్లో వెలుగులు పోయాయి.. ప్రతిచోటా చీకటి అలుముకుని ఉంది. మీకు ఏమి చెప్పాలో లేదా ఎలా చెప్పాలో నాకు పూర్తిగా తెలియదు. మన ప్రియతమ నాయకుడు.. జాతిపిత అని మనం పిలిచే బాపు ఇక లేరు'' అని ప్రకటించారు.

నాథూరామ్ గాడ్సేతో పాటు అతని సహచరుడు నారాయణ్ ఆప్టేను ఉరితీయగా.. మరో ఆరుగురికి జీవిత ఖైదు విధించారు. గాంధీ మరణానంతరం భారతదేశం సహనం- సత్యం- అహింస అనే అంశాలకు సంబంధించి ఒక నిర్దిష్ట ఒప్పందాన్ని కోల్పోయింది. దానిని అంగీకరించడానికి నేటి నాయకులు సిద్ధంగా ఉన్నారా?

అలా అయితే ఏం జరిగేదో?

ఇక 'ఇన్సెప్షన్' సినిమాలో లాగా చనిపోయాక కూడా బతికే టెక్నాలజీ అందుబాటులో ఉంటే..? లేదా గాంధీజీ శరీరంలోకి ఆ మూడు బుల్లెట్లు దిగాక 15 నిమిషాల పాటు బతికే ఉన్నారు కదా? ఆ సమయంలో సరైన ప్రాథమిక చికిత్స లేదా వైద్యం అందించే నైపుణ్యం అప్పటి ప్రజలకు ఉండి ఉంటే... ఏం జరిగేదో!!నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.