Begin typing your search above and press return to search.

కరోనా వార్డుల్లో విధులు నిర్వహించలేం..గాంధీ సిబ్బంది!

By:  Tupaki Desk   |   27 March 2020 6:03 AM GMT
కరోనా వార్డుల్లో విధులు నిర్వహించలేం..గాంధీ సిబ్బంది!
X
కరోనా వైరస్ ..ఈ పేరు వింటే ఇప్పుడు ప్రపంచం మొత్తం గజగజవణికిపోతుంది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ కరోనా దెబ్బకి చతికిలపడిపోయాయి. కరోనా వెలుగులోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా కూడా కరోనా కి సరైన మందు కనిపెట్టడంలో ప్రపంచం మొత్తం విఫలం అయ్యింది. దీనితో తగిన మూల్యం చెల్లించుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా 532,263 మంది కరోనా భారిన పడగా ... 24,090 మంది కరోనా వైరస్ తో మృతి చెందారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గురువారం 733కు చేరగా మృతుల సంఖ్య 20కి పెరిగింది.

కరోనా మహమ్మారి ప్రాణాలు తీస్తుందని తెలిసినప్పటికీ కూడా డాక్టర్లు , తమ ప్రాణాలని పనంగా పెట్టి మరీ కరోనా సోకిన వారికీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయినప్పటికీ డాక్టర్లకి - వైద్య సిబ్బందికి సరైన రక్షణ ఉండటంలేదు. దీనితో కరోనా కి బయపడి ..గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది స్వచ్ఛందంగా సెలవులపై వెళ్తున్నారు. అందులో పని చేస్తున్న నర్సులు - ఆయాలు - సెక్యూరిటీ గార్డులు కరోనా వార్డులో పనిచేయలేమంటూ తేల్చి చెప్తున్నారు.

ఐసోలేషన్ వార్డులో కరోనా రోగులకు 24 గంటలూ సేవలందిస్తున్నామని, కానీ తమ జాగ్రత్తలను ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా రోగులకు సేవలు చేసి.. ఇంటికెళ్లి భర్త - పిల్లలను కలిసేందుకు కూడా భయం వేస్తోందని చెప్పారు. అలాగే మేము ఇంటి నుంచి బయటికొస్తే కాలనీవాసులకు భయపడాల్సి వస్తోందని వెల్లడించారు. ఆస్పత్రిలో నర్సులకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఈ మేరకు నర్సులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రావణ్ కుమార్‌ ను కోరారు.

అలాగే తమ డ్యూటీ టైం అయిపోగానే తమని తీసుకోని పోవడానికి తమ భర్తలు వస్తే - వారిని కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని - తమ భర్తలకు రవాణా పాసులు ఇవ్వాలని కోరారు. అయితే , వీరిని గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఉన్న ఓ పాత భవనంలో ఉండాలని అధికారులు ఆదేశించారని - కానీ - ఆ భవనం పాతబడింది అని , దాన్ని పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి ఇస్తే - ఇక్కడే ఉండి విధులు నిర్వహిస్తాము అని తెలిపారు. ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా తమ ఆరోగ్యంపై భయంగా ఉంటోందని - తాము కూడా ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనితో గాంధీ లో సీనియర్ నర్సులు సైతం తమకు సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఏ విదంగా స్పందిస్తుందో చూడాలి మరి...