Begin typing your search above and press return to search.

తమిళ మంత్రివర్గంలో గాంధీ, నెహ్రూ !

By:  Tupaki Desk   |   8 May 2021 3:49 AM GMT
తమిళ మంత్రివర్గంలో గాంధీ, నెహ్రూ !
X
తమిళనాడు లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. దశాబ్దల కల నెరవేరి డీఎంకే ఏ పార్టీ సహాయం లేకుండా అధికారంలోకి వచ్చింది. తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ప్రమాణస్వీకారం చేశారు. అలాగే సీఎంతో మరో 34 మంత్రులు కూడా స్టాలిన్ తో పాటు ప్రమాణం చేశారు. తన తండ్రి కరుణానిధి మంత్రివర్గంలో పని చేసిన వారికి సీఎం స్టాలిన్ మరోసారి అవకాశమిచ్చారు. ఇదిలా ఉంటే తమిళనాడు లో స్టాలిన్ మంత్రివర్గంలోని నేతల పేర్లు మరోసారి ప్రాధాన్యతను సంతరించుకుంది. స్టాలిన్ మంత్రివర్గంలో గాంధీ , నెహ్రు స్థానం సంపాదించుకున్నారు. అలాగే మరో గాంధీ కూడా తమిళనాడు లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఇక ఆ ఇద్దరికి కేటాయించిన శాఖలు చూస్తే మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. చేనేత వస్త్రాలు, ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల బోర్డు శాఖలు ఆర్ గాంధీ కి ఇచ్చారు. ఇక కెఎన్ నెహ్రూకు పట్టణ మరియు నీటి సరఫరా బాధ్యత కలిగిన మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పారు. గాంధీ పేరుకు, నెహ్రూ పేరుకు తగ్గ శాఖలు కేటాయించడం కొంత ఆశ్చర్యంగానే అనిపిస్తోంది. ఆర్ గాంధీ రాణిపేట నియోజకవర్గం నుండి తమిళనాడు అసెంబ్లీకి 1996 లో మొదట డీఎంకే అభ్యర్థిగా ఎన్నికయ్యారు. గాంధీ, అతని భార్య, కొడుకుతో పాటు, అనేక మంది డీఎంకే మంత్రులతొ పాటు అసమాన ఆస్తులను కలిగి ఉన్నారని అప్పట్లో అభియోగాలు నమోదు అయ్యాయి. సాక్ష్యాలు లేనందున ఈ ఆరోపణలను కోర్టులు రద్దు చేశాయి. ఇక ,కెఎన్ నెహ్రూ డీఎంకే ప్రధాన కార్యదర్శి, పార్టీ లో సీనియర్ నాయకుడు. తిరుచి పశ్చిమ నియోజకవర్గం నుండి వరుసగా ఐదవసారి ఎన్నికలలో పోటీ చేశారు. ఆయన తండ్రి కాంగ్రెస్ సభ్యుడు. దీంతో ఆయనకు జవహర్‌ లాల్ నెహ్రూ పేరు పెట్టారు, ఏదేమైనా, ఈ కుటుంబం 1960 ల చివరలో డీఎంకేకు దగ్గరైంది. తర్వాత నెహ్రూ 1989 లో తన మొదటి ఎన్నికలలో గెలిచినప్పటి నుండి పార్టీకి బలమైన వ్యక్తిగా ఉంటూ వస్తున్నారు.