అమెరికా ఎన్నికల్లో విజయగద్దె జోక్యం.. ట్విట్టర్ ఫైల్స్ తో ఎలన్ మస్క్ సంచలన నిజాలు

Sat Dec 03 2022 20:15:40 GMT+0530 (India Standard Time)

Gadde Vijaya interfered in US elections Musk

ట్విటర్ కొత్త అధినేత ఎలన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేశారంటూ ట్విటర్ లీగల్ మాజీ అధిపతి విజయ గద్దెపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2020 ఎన్నికల సమయంలో జోబైడెన్ టీంతో గద్దె జరిపిన సంభాషణలు బయటకు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ విడుదల చేశారు.ఇద్దరు భారతీయ అమెరికన్లు - కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా -విజయ గద్దే - అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కుమారుడు హంటర్ బిడెన్  ల్యాప్‌టాప్ కు సంబంధించిన విషయం ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. దీని పూర్తిగా బహిర్గతం చేసిన ఎలోన్ మస్క్ మైక్రోబ్లాగింగ్ సైట్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

గత నెలలో ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు మస్క్ 2020కి ముందు ప్రచురించబడిన హంటర్ బిడెన్ ల్యాప్‌టాప్ గురించి న్యూయార్క్ పోస్ట్ వార్తాపత్రిక చేసిన వివాదాస్పద కథనాన్ని ట్విట్టర్ దాచేసిందని పేర్కొంది. దాని గురించి వివరాలను విడుదల చేస్తానని శుక్రవారం ఎలన్ మస్క్ ప్రకటించాడు. విజయగద్దె ఎలా ట్విటర్ ను బేస్ చేసుకొని జోబైడెన్ గెలుపునకు సహకరించారన్నది బయటపెట్టాడు.
 
హంటర్‌కు చెందిన ల్యాప్‌టాప్ నుండి తిరిగి పొందిన ఇమెయిల్‌లను కలిగి ఉన్నట్లు కథనం పేర్కొంది. ట్రంప్ మాజీ వైట్ హౌస్ చీఫ్ స్ట్రాటజిస్ట్ స్టీవ్ బన్నన్ నుండి ఈమెయిల్స్  తెలుసుకున్నామన్నామని తెలిపారు.

2020 అక్టోబర్ 14న హంటర్ బైడెన్ ల్యాప్ ట్యాప్ లోని రహస్య ఈమెయిల్స్ గురించి న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రచురించింది. ఈ కథనం ఎక్కువగా వ్యాప్తి చెందకుండా ట్విటర్ తీవ్రమైన చర్యలకు పాల్పడింది. హంటర్ బైడెన్ న్యూయార్క్ పోస్టులకు సంబంధించిన లింకులను తొలగించడమే కాకుండా వాటికి వార్నింగ్ సందేహాలు జత చేసింది.

ఓ టూల్ ద్వారా బైడెన్ స్టోరీ ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లకుండా ట్విటర్ అడ్డుకుంది. ఈ నిర్ణయాన్ని ట్విటర్ ఉన్నతస్థాయి ఉద్యోగులే తీసుకున్నారు. కానీ ఈ విషయం అప్పటి సీఈవో జాక్ డోర్సీకి తెలియదు. ట్విటర్ లీగల్ పాలసీ హెడ్ విజయ గద్దె ఇందులో కీలక పాత్రపోషించారు అని తేలింది. ఇదే విషయాన్ని ఎలన్ మస్క్ బయటపెట్టి సంచలనానికి తెరతీశాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.