Begin typing your search above and press return to search.

జీఎస్టీ దంచేసి రాష్ట్రాలకు పంచేస్తుందట..!

By:  Tupaki Desk   |   12 Dec 2019 11:43 AM GMT
జీఎస్టీ దంచేసి రాష్ట్రాలకు పంచేస్తుందట..!
X
కేంద్రం అనుకున్నదొకటి అవుతుంది మరొకటి.. జీఎస్టీ తెచ్చి సరళమైన పన్ను విధించామని సంతోష పడింది. అయితే దేశాన్ని కమ్మేసిన ఆర్థికమాంద్యం కారణంగా జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పడిపోయాయి. 2017లో అమల్లోకి వచ్చిన జీఎస్టీ వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ -నవంబర్ మధ్యన గణనీయంగా తగ్గాయట.. ఏకంగా 40శాతం కోత పడింది.

ఆర్థిక మాంద్యంతో కొనుగోళ్ల శక్తి తగ్గడంతో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పడిపోతున్నాయి.. దీంతో ఈ నెలలోనే రూ.5,26,000 కోట్ల వసూళ్లు వస్తుందని అంచనావేయగా కేవలం రూ.3,28,365 కోట్లు మాత్రమే వచ్చిందట.. అనుకున్న దానికంటే భారీగా తగ్గిన వసూళ్లు చూసి కేంద్రం పునరాలోచనలో పడిపోయింది.

జీఎస్టీ అమలు వల్ల ఆయా రాష్ట్రాలకు ఏర్పడ్డ ఆదాయ లోటును పూడ్చేందుకు వీలుగా కేంద్రం తాజాగా గరిష్ట పన్ను స్లాబ్ లకు అదనంగా పరిహార సుకం వసూలు చేస్తోంది. పరిహారం పెంచాలని రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే కొన్ని ఉత్పత్తులపై జీఎస్టీని పెంచేందుకు కేంద్రం సిద్ధమైంది. రాష్ట్రాలకు జీఎస్టీ పన్ను పరిహారం చెల్లింపులు పెండింగ్ లో పడిపోవడంతో అదనపు వనరుల కోసం పన్నురేట్లను పెంచడం తప్ప మరో మార్గం లేదని కేంద్రం భావిస్తోంది. ఈ నెల 18న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలోనే చాలా వస్తువులపై పన్ను పెంచనున్నారు.