Begin typing your search above and press return to search.

యోగా పై గ్రీక్ చ‌ర్చి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌: ‌యోగాకు మ‌తాన్ని అంట‌గ‌ట్టింది

By:  Tupaki Desk   |   6 Jun 2020 10:10 AM GMT
యోగా పై గ్రీక్ చ‌ర్చి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌: ‌యోగాకు మ‌తాన్ని అంట‌గ‌ట్టింది
X
ప్ర‌పంచంలో అత్యుద్భుత ఆరోగ్య సాధ‌నం యోగా. మాన‌సిక ప్ర‌శాంత‌త‌కు.. వ్య‌క్తిగ‌త జీవితంలో కొద్దిసేపు యోగా చేస్తే తెలియ‌ని ఉత్సాహం శ‌రీరానికి క‌లుగుతుంది. అందుకే ప్ర‌పంచ దేశాలు యోగాను త‌మ జీవితంలో భాగం చేసుకుంటున్నారు. అందుకే ప్ర‌పంచ యోగా దినోత్స‌వం నిర్వ‌హించాల‌ని భార‌త్ ప్ర‌తిపాద‌న చేస్తే ప్ర‌పంచ దేశాల‌న్నీ ఆహ్వానించి ఆ కార్య‌క్ర‌మాన్ని వేడుక‌గా నిర్వ‌హించుకుంటున్నాయి. యోగాను అన్ని మ‌తాల వారు చేసుకోవ‌చ్చు. ఆ ప్ర‌క్రియ మ‌త‌ప‌ర‌మైన‌ది కాదు. వ్యాయామాలు ఎలాగో యోగా కూడా అలాంటిదే. దీంతో అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతున్న ఆ యోగాకు గ్రీక్‌కు చెందిన ఓ చ‌ర్చి మ‌తాన్ని ఆపాదించింది. లాక్‌డౌన్ ఒత్తిడిని ఎదుర్కోవటానికి యోగాను ఉపయోగించడంపై గ్రీకు ఆర్థోడాక్స్ చర్చి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. త‌మ మ‌త‌ విశ్వాసంలో యోగాకు స్థానం లేదని సంచ‌ల‌న ప్రకటించింది. ఎందుకంటే యోగా అనేది హిందూ మతంలో ఒక ప్రాథమిక భాగం అని చర్చి వెల్లడించడం గ‌మ‌నార్హం.

యోగా అనేది త‌మ ఆర్థడాక్స్ విశ్వాసానికి పూర్తిగా విరుద్ధంగా ఉందని, క్రైస్తవుల జీవితం లో యోగాకు చోటు లేదని గ్రీస్ చర్చి పాలకమండలి హోలీ సైనాడ్ ఇటీవ‌ల సంచ‌ల‌న ప్రకటన చేసింది. యోగా హిందూ మతంలో ఒక ప్రాథమిక అధ్యాయమే కానీ, శారీరక వ్యాయామం కాదని స్పష్టంచేసింది. యోగాను ఒత్తిడిని ఎదుర్కోవటానికిఒక మార్గంగా గ్రీకు మీడియా సిఫారసు చేసిన తరువాత జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు హోలీ సైనాడ్ పేర్కొంది. అయితే ఇలాంటి దానిపై 2015లోనే యోగా అభ్యాసానికి క్రైస్తవుల జీవితాలలో స్థానం లేదని చర్చ్ ఆఫ్ గ్రీస్ ప్రకటించింది. అవే కారణాలు ఇప్పుడు మళ్లీ చెబుతోంది.

అంతర్జాతీయ యోగా సమాఖ్య ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ల మంది ప్రజలు యోగా సాధన చేస్తారని అంచ‌నా. అయితే యోగా అనేది అంతర్గతంగా హిందూ కార్యకలాపం అని ఒక దుర‌భిప్రాయం ఉంది. యోగా హిందూవుల‌కు చెందిన ఒక ప్ర‌క్రియ అని చర్చ కొన‌సాగుతోంది, ఇది సూర్య నమస్కారాలతో సహా ఆధ్యాత్మిక అంశాలను ఉపయోగిస్తుండం తో ఇది హిందూవుల‌కు సంబంధించిన‌ది పేర్కొంటున్నారు. యోగా అనేది వందనం నుంచి ఉద్భవించిందని క్రైస్తువులు చెబుతున్నారు. మత మార్పిడి చేయడానికి యోగా దోహ‌దం చేస్తుంద‌ని ఈ చ‌ర్చి తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. ఈ నిర్ణ‌యంపై ప్ర‌పంచ‌ వ్యాప్తం గా యోగా అభ్యాస‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. యోగాను అధ్య‌య‌నం చేయాల‌ని, దాని త‌ర్వాత ఈ మాట చెప్పాల‌ని సూచిస్తున్నారు. శారీర‌క వికాసానికి, మాన‌సిక ప్ర‌శాంతత‌కు దోహ‌దం చేస్తున్న యోగాను ఒక మ‌తానికి ఆపాదించ‌డం స‌రికాద‌ని చ‌ర్చి నిర్ణ‌యంపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ సాగుతోంది. దీనిపై భార‌త్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.