కరోనా చావులని క్యాష్ చేసుకుంటున్న ఆ సంస్థలు .. జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం !

Fri Apr 23 2021 06:00:01 GMT+0530 (IST)

GHMC sensational decision on Corona funeral

కరోనా వైరస్ .. ఈ పేరు చెప్తే భయపడని వారంటూ ఎవరూ ఉండరు అంటే అతిశయోక్తి లేదు. సామాన్య ప్రజల నుండి విఐపిలు వివిఐపిలు రాజకీయ నేతలు బిజినెస్ మెన్స్ ఇలా ప్రతి ఒక్కరూ కూడా కరోనా దెబ్బకి వణికిపోయారు. ఇక కరోనా సెకండ్ వేవ్ లో ముఖ్యంగా ఎక్కువగా ప్రముఖులే వైరస్ భారిన పడుతున్నారు. పలువురు సీఎంలతో పాటుగా మాజీ పీఎం కూడా కరోనా భారిన పడ్డారు. ఇదిలా ఉంటే .. కరోనా భారిన పడి ఆస్పత్రుల్లో ఉంటే .. లక్షల్లో బిల్లులు వేసి ఆ బిల్లు చూసి గుండె పగిలిపోయేలా చేస్తున్నారు. కరోనా సమయం అని ఈ సమయంలో ఎక్కువగా బిల్లులు వేయద్దు అని ప్రభుత్వాలు చెప్తున్నా కూడా భారీగా బిల్లులు వేస్తున్నారు. అయినప్పటికీ డబ్బున్న కొందరు ప్రైవేట్ హాస్పిటల్ లోనే కరోనా ట్రీట్మెంట్ కోసం ఎగబడుతున్నారు. ఇక కరోనా భారిన పడిన వారి పరిస్థితి అలా ఉంటే .. కరోనా భారిన పడి మరణించిన వారి కుటుంబ సభ్యుల పరిస్థితి మరోలా  ఉంది. అందివచ్చిన అవకాశం అంటూ కొన్ని సంస్థలు కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తూ వేలకి వేలు దండుకుంటున్నాయి.ముఖ్యంగా  కరోనా తో మరణించిన వారి మృతదేహాలకు ఎక్కడ దహన సంస్కారాలు జరుగుతాయి అనే విషయం పై  చాలా మందికి స్పష్టత లేదు. ఇదే అదనుగా కొన్ని సంస్థలు చావునూ కూడా వ్యాపారం చేస్తున్నాయి. అంత్యక్రియలకు రూ.30-40 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ముఖ్యంగా గత ఏడాది లాక్ డౌన్ వేసిన మొదట్లో అంత్యక్రియలకు లక్షల్లో కట్టిన వారు కూడా ఉన్నారు.  సాధారణ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం లేక బాధితులు అడిగినంత ఇవ్వాల్సి వస్తోంది. దీనితో  తాజాగా జీహెచ్ ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తో  పేద మధ్య తరగతి వర్గాలకు కొంత ఉపశమనంగా మారనుంది. అదేమిటి అంటే ఇళ్లలో మరణించిన కొవిడ్ రోగుల అంత్యక్రియల నిర్వహణకు జీహెచ్ ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. పాజిటివ్ గా నిర్ధారణ అయి హోం ఐసోలేషన్ లో ఉంటూ చనిపోయిన వారి దహన సంస్కారాలు జీహెచ్ ఎంసీ నిర్వహిస్తోందని ఓ అధికారి తెలిపారు. దానికి అయ్యే  వ్యయాన్ని సంస్థే భరిస్తుందని అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరణించిన వారి మృతదేహాలకు మాత్రమే జీహెచ్ ఎంసీ ఖర్చులతో అంత్యక్రియలు చేస్తున్నారు. బాధితులు 040-2111 1111 91546 86549  9154686558 కొవిడ్ కంట్రోల్ నెంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు