Begin typing your search above and press return to search.

గ్రేటర్ ఫలితాల వేళ.. కేసీఆర్ ఇది చదవాల్సిందే

By:  Tupaki Desk   |   5 Dec 2020 3:30 PM GMT
గ్రేటర్ ఫలితాల వేళ.. కేసీఆర్ ఇది చదవాల్సిందే
X
ఇవాల్టి రోజున తమకున్న టాలెంట్ ను ప్రదర్శించుకోవటానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కాస్తంత కామన్ సెన్సు. మరికాస్త సెన్సాఫ్ హ్యుమర్ తోపాటు.. సోషల్ మీడియాను సరైన రీతిలో వాడుకుంటే.. గుర్తింపు దానంతట అదే వస్తుంది. గ్రేటర్ ఎన్నికల వేళ.. అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటమికి (మెజార్టీ సీట్లు వచ్చాయని అని మొండిగా వాదిస్తే మనమేం చేయలేం) కారణం ఏమిటి? అన్న దానిపై తాజాగా ఒక సామాన్యుడు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు చేశాడు. దాన్ని యథాతధంగా తీసుకుంటే.. ఫ్లేవర్ మిస్ కాకుండా ఉండటమే కాదు.. సదరు సామాన్యుల మనోగతం మరింత వివరంగా అర్థమయ్యే అవకాశం ఉంది.

ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తే.. ఈ పోస్టు చదివితే చాలానే విషయాలు అర్థమవుతాయి. ఇందుకోసం నిఘా వర్గాల్ని భారీగా వినియోగించి.. రిపోర్టులుతెప్పించుకోవాల్సిన అవసరమే లేదు. ఇంతకీ ఆ పోస్టుల్లో ఏముందన్నది చూస్తే..

- మీకు ఎదురైన మొదటి ఓటమి లోకసభ ఎన్నికలు 6 నెలల ముందు 105 సీట్లు డిపాసిట్ కోల్పోయిన పార్టీ ఏకంగా నాలుగు ఎంపీలు ఎందుకు గెలిసింది మొత్తం ఏడు ఎంపీలు ఎందుకు ఓడిపోయాం అని ఒక్కరోజు ఐనా సమీక్ష చేసారా?

- ఆ ఓటమి తరువాత వచ్చిన జిల్లా పరిషత్ మండల పరిషత్ మునిసిపల్ ఎన్నికలలో గెలుపుతో ఆ ఓటమిని కవర్ చేసుకున్నారు తప్ప సమీక్ష చేసుకోలేదు.

- ఇప్పుడు హైదరాబాద్ ఎన్నికల్లో ఓటమిని రెండు విధాలుగా అనాలిసిస్ చేయాలి ఒకటి ప్రభుత్వ పరమైన లోపాలు రెండోది పార్టీ పరమైన లోపాలు.

- మొదట ప్రభుత్వం గురించి చూద్దాం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇక మనకు ఎదురులేదు అన్న భావన ఉంది అని ప్రజల్లోకి వెళ్లింది దానికి కొన్ని కారణాలు మొదటి 8 నెలలు మంత్రి వర్గాన్ని విస్తరించక పోవడం ఆర్టీసీ సమ్మె వాళ్ళల్లో అంత వ్యతిరేకత వచ్చే దాకా లాగి చివరకు వాళ్ళు ఆడిగినవన్ని ఇచ్చారు కాని ఏమి లాభం అప్పటికే వాళ్లకి ప్రభుత్వం అంటే వ్యతిరేకత ఏర్పడింది.

- ఇక ఉద్యోగులకి పీఆర్సీ 2018 నుండి ఇస్తా అని ఉరిస్తున్నారు. కనీసం మధ్యంతర భృతి కూడా ఇవ్వలేదు. వాళ్ళకి రిటైర్మెంట్ వయసు 61 కి పెంచుతూ అని చెప్పి ప్రతి నెల ఎదురు చూసి రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు.

- కరోనా వేళ.. అన్ని రాష్ట్రాల్లో వేలల్లో టెస్ట్స్ చేస్తున్నప్పుడు ఇక్కడ వందల్లో చేసారు. దాని గురించి ఒక నెల రోజులు ఎంతమంది మొత్తుకున్నా మేము ఇన్నే చేస్తాం అని మొండికేసారు. అదే టైంలో ప్రతి తెల్ల కార్డ్ వ్యక్తికి నెలకు 1500 చొప్పున రెండు నెలలు మూడు వేలు ఉచిత బియ్యం కలిపి 3000 కోట్లు ఖర్చు చేసారు. అదొక్కటే కాదు సుమారు 20 వేల కోట్లతో లోక్డౌన్ టైంలో రైతుల పండించిన ప్రతి గింజను గ్రామాల్లో కొన్నారు. కానీ ఇవన్నీ కరోన కి టెస్టులు సరిగ్గా చేయట్లేదు అనే దాని వల్ల అన్ని బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి .

- ప్రభుత్వం మీద అప్పటి వరకు లో లోపల ఉన్న వ్యతిరేకత అన్ని వర్గాల్లో మొదలు అయ్యింది ఇక యువత పార్టీ కి దూరం అవ్వడానికి కారణం గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఎక్కువ వేయకపోడం. పోలీసు.. విద్యుత్ ఇలాంటి డిపార్ట్మెంటల్ ఉద్యోగాలు ఒక లక్ష వరకు వేసినా కూడా గ్రూప్ 1 అసలు వేయకపోడం వచ్చినవేమో కోర్ట్ కేసుల్లో ఉండటం వాళ్లలో ఉన్న అసంతృప్తికి ప్రధాన కారణం .అందుకే వాళ్ళు బిజెపి హిందూ ఎజెండా కి ఆకర్షితులు అవుతున్నారు.

- ఎల్ఆర్ఎస్ ఇది కొత్త కాకపోయినా ఒకప్పుడు అది తప్పనిసరి కాదు ఇష్టం ఉన్నవాళ్ళు చేయించుకునే వాళ్ళు కానీ మీరు ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తాం లేకపోతే చేయము అని మూడు నెలల నుండి రిజిస్ట్రేషన్ ఏకపక్షంగా ఆపేయడం మధ్యతరగతి వర్గాల్లో తీవ్ర అసంతృప్తి కి కారణం అయ్యింది. ఈ ఎల్ఆర్ఎస్ అనేది ఇప్పుడు రాష్టవ్య్రాప్తంగా ఉన్న అతి పెద్ద సమస్య.

- మఇక రెండో సారి అధికారంలోకి వచ్చాక సీనియర్లు అందరిని పక్కన పెట్టడం. ఉదాహరణకు పొంగులేటి కడియం జూపల్లి లాంటి వాళ్ళని ఇక మంత్రి వర్గం గురించి తెలిసిందే మొన్న హైదరాబాద్ లో వరదలు వస్తే ముఖ్యమంత్రి ఓదార్చకుండా కేటీఆర్ ఎంత తిరిగితే ఏమి లాభం?

- రూ.10 వేలు ఇస్తే ఏమి లాభం? జనాలు ముఖ్యమంత్రి ఓదార్చదానికి రాలేదు అనే అంటున్నారు. ఇక టీవీ చర్చలకి పార్టీ నుండి ప్రాతినిధ్యం లేదు.
దానివల్ల విమర్శలకి కౌంటర్ ఇచ్చే వాళ్ళు లేరు. పార్టీ అనుమతి లేకుండా ఇస్తే సస్పెండ్ చేస్తాం అని మీరు అన్నారు. అక్కడేమో పార్టీ మారిన లీడర్స్ ఇంటర్వూస్ యూట్యూబ్ మొత్తం ఉన్నాయి. ముఖ్యమంత్రి ని వ్యక్తిగతంగా తిడుతూ దానికి పార్టీ నుండి కౌంటర్ లేదు. ఈ రోజుల్లో యూట్యూబ్ అనేది ప్రధాన మీడియా దాన్ని ప్రభావం మీకు అర్థం అవ్వట్లేదు.

- ఇక బూత్ స్థాయి నుండి పార్టీ నిర్మాణం ఉన్న దానిని వాడుకొని సోషలో మీడియాలో పార్టీని బలోపేతం చేయడం మీద దృష్టి పెట్టడం అటు ఉంచి ఉన్న కొంతమంది భజన బ్యాచ్ దాని వల్ల ఇంకా ఎక్కువ నెగిటివ్ అవుతుంది.

- ఇక అతి ముఖ్యమైన విషయం హరీష్ రావు లాంటి మాస్ లీడర్ ని పార్టీ ఎక్కువగా వినియోగించుకోలేక పోవడం. ఇక డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇంకో 20 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్న ప్రజలను మీరూ దీన్ని సంతృప్తి చేయలేరు జనాన్ని భూమి కొని ఒక్క ఇంటికి 7-8 లక్షలు ఖర్చు చేసి పేదలు అందరికి ఇవ్వడం జరగని పని దాని కంటే ఒక్క ఇంటికి గతంలో లా ఒక్కో ఇంటికి ఒక లక్ష ప్రభుత్వం నుండి ఇచ్చి మీరే కట్టుకోండి అని ఇవ్వడం ఉత్తమం.

- ఎక్కువ మంది లబ్ధిదారులు వస్తారు అప్పుడు ఇక ఇప్పుడు కొత్త పంచాయతీ చట్టం వల్ల సర్పంచ్ లో తీవ్ర వ్యతిరేకత ఉంది. హరితహారం మొక్కలు పోతే సర్పంచ్ ల మీద చర్యలు తీసుకోడంతో వారంతా అసంతృప్తి తో ఉన్నారు.