Begin typing your search above and press return to search.

40 ఏళ్ల కనిష్టానికి దిగజారిన జీడీపీ !

By:  Tupaki Desk   |   1 Jun 2021 9:40 AM GMT
40 ఏళ్ల కనిష్టానికి దిగజారిన జీడీపీ !
X

కరోనా దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత కనిష్టంగా 23.9 శాతం తగ్గింది. 1996లో త్రైమాసిక ఆర్థిక గణన విధానాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి ఇంత తక్కువ జీడీపీ నమోదు కావడం ఇదే తొలిసారి. గత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.3% క్షీణించి 40 ఏళ్ల కనిష్టానికి జారిపోయింది. అయితే, కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రారంభానికి ముందు త్రైమాసికం (క్యూ4)లో ఎకానమీ కొంత పురోగతి సాధించింది. 2020–21 ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో వరుసగా రెండవ క్వార్టర్‌ లోనూ వృద్ధి బాటన నడిచింది. మార్చి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 1.6 శాతంగా నమోదయ్యింది. అక్టోబర్‌, డిసెంబర్‌ త్రైమాసికంలోనూ భారత్‌ ఎకానమీ 0.5% వృద్ధిని నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే.

దేశంలో గతేడాది కరోనా లాక్‌ డౌన్ విధించడం, ఆర్థిక కార్యకలాపాలన్నీ నిలిపివేయడంతో ఆర్థిక వృద్ధి పడిపోయింది. దీంతో దేశ జీడీపీ 4 దశాబ్దాల దిగువకు కుదేలైంది. 1980 సయమంలో ఇంత తక్కువ జీడీపీ నమోదైందు కాగా.. మళ్లీ ఇప్పుడు అదే తరహా జీడీపీ గణాంకాలు నమోదయ్యాయి. కఠిన లాక్‌ డౌన్‌ నేపథ్యంలో 2020–21 తొలి జూన్‌ త్రైమాసికంలో ఎకానమీ 24.4 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. తదుపరి జూలై– సెప్టెంబర్‌ త్రైమాసికంలో క్షీణత 7.4 శాతానికి పరిమితమైంది. ఇక మొత్తం 2020–21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ క్షీణత 7.3 శాతానికి పరిమితమైంది. నిజానికి 7.5 శాతం నుంచి 8 శాతం వరకూ క్షీణ అంచనాలు నమోదయ్యాయి.కానీ 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో 3 శాతం వృద్ధి నమోదైంది.

అంతకుముందు ఏడాది (2019-20) ముఖ్యంగా తయారీ, నిర్మాణ రంగాల్లో స్తబ్దత కారణంగా దేశ జీడీపీ 4.2 శాతానికే పరిమితమైంది. ఇది 11 ఏళ్ల కనిష్ఠం. కరోనా మహమ్మారి చుట్టు ముట్టడంతో 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏకంగా 24.38 శాతం క్షీణత నమోదైంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జనవరిలో వెలువరించిన తొలి విడత అంచనాల్లో 7.7 శాతం క్షీణతకు చేరే అవకాశం ఉందని నిపుణులు తెలుపగా.. ఆ తర్వాత 8 శాతం వరకు దిగజారే అవకాశం ఉందని ఎన్‌ ఎస్‌ వో హెచ్చరించింది. ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఆదాయాలు రూ.16,89,720 కోట్లు. ఇందులో రూ.14,24,035 కోట్లు పన్నులు, రూ.2,08,059 కోట్ల పన్ను రహిత ఆదాయాలుకాగా, రూ. 57,626 కోట్లు రుణ రికవరీ, పెట్టుబడుల ఉపసంహరణలకు సంబంధించి వసూలయిన నాన్‌–డెట్‌ క్యాపిటల్‌ ఆదాయాలు. ఇక ప్రభుత్వ వ్యయాల మొత్తం రూ. 35,11,181 కోట్లు. ఇందులో రూ.30,86,360 కోట్లు రెవెన్యూ అకౌంట్‌ నుంచి వ్యయమవగా, రూ.4,24,821 కోట్లు క్యాపిటల్‌ అకౌంట్‌ నుంచి ఖర్చయ్యాయి. వెరసి రూ.18,21,461 కోట్ల ద్రవ్యలోటు నమోదయ్యింది.