Begin typing your search above and press return to search.

వైసీపీ.. హ్యాపీ.. ఇంతానందం ఇప్ప‌ట్లో చూడ‌లేదే!

By:  Tupaki Desk   |   16 Sep 2021 3:30 PM GMT
వైసీపీ.. హ్యాపీ.. ఇంతానందం ఇప్ప‌ట్లో చూడ‌లేదే!
X
ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఫుల్ జోష్ క‌నిపిస్తోందా? ఇప్ప‌టి వ‌ర‌కు.. గ‌డిచిన ఏడాది కాలంలో చూడ‌ని ఆనం దం.. ఇప్పుడు క‌నిపిస్తోందా? నేత‌లు హుషారుగా ఉన్నారా? మ‌రీ ముఖ్యంగా.. ఈ రోజు జ‌రిగిన కేబినెట్‌లో మ‌రింత ఆనందం క‌నిపిస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వైసీపీలో ఇటీవ‌ల కాలంలో తీవ్ర‌మైన అల‌జ‌డులు క‌నిపించాయి. కోర్టుల నుంచి మొట్టికాయ‌లు.. ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు.. వెర‌సి.. కేంద్రం నుంచి అప్పులు పుట్ట‌క‌పోవ‌డం.. పైగా త‌నిఖీల పేరిట‌.. కేంద్రం నుంచి అధికారులు రావ‌డం హ‌డావుడి.. అంతా కూడా వైసీపీలో ఒక‌విధ‌మైన ఆందోళ‌న నెలకొంది.

స్థానిక ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నా.. సంతోషంగా గ‌డ‌ప‌లేని ప‌రిస్థితి పార్టీలో నెల‌కొంద‌ని.. చాలా మంది నాయ‌కులు ఆఫ్ దిరి కార్డుగా పేర్కొన్నారంటే.. ప‌రిస్థితి ఏంటో అర్ధం చేసుకోవ‌చ్చు. అయితే.. ఇప్పుడు మాత్రం వైసీపీలో అనూహ్య‌మైన ఆనందం ప‌ర‌వ‌ళ్లు తొక్కుతోంది. పార్టీకి, పార్టీ అ ధినేత‌కు కూడా ఇప్పుడు సంతోషంగా ఉంద‌ని.. అంటున్నారు. వైసీపీ నేత‌ల‌మ‌ధ్య ఈ విష‌యాలే.. చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఒక‌టి కాదు.. రెండు మూడు కార‌ణాలుఉన్నాయ‌ని అంటున్నారు నాయ‌కులు. ప్ర‌ధానంగా .. వైసీపీ అధినేత , సీఎం జ‌గ‌న్‌కు బెయిల్ ర‌ద్దు విష‌యంలో క‌లిగిన ఊర‌ట‌.. అని చెబుతున్నారు..

సొంత పార్టీ ఎంపీ ర‌ఘురామ‌రాజు.. సీఎం జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. కోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై ఆదిలో వైసీపీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీ అధినేత‌, సీఎంకు బెయిల్ ర‌ద్ద‌యితే.. ప‌రిస్థితి ఏంట‌ని.. అంద‌రూ చెవులు కొరుక్కున్నారు. కానీ, దీనికి తెర‌ప‌డి.. రిలీఫ్ వ‌చ్చిన వెంట‌నే అంద‌రూ హ్యాపీ గా ఫీల‌వుతున్నారు. ఇక‌, మ‌రో కార‌ణం.. ఎంపీటీసీ , జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల విష‌యంలో హైకోర్టు సానుకూల తీర్పును వెలువ‌రించ‌డం .. వైసీపీలో మ‌రింత జోష్ పెంచింది. ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై సింగిల్ జ‌డ్జి ఇచ్చిన‌.. తీర్పును కొట్టేస్తూ.. హైకోర్టు తాజాగా తీర్పు వెలువ‌రించింది.

ఇక‌, మూడో అంశం.. కేంద్రం నుంచి అప్పుల‌కు అనుమ‌తులు ల‌భించ‌డం. ఇటీవ‌లే రూ.2655 కోట్లకు కేంద్ం అనుమ‌తి ఇచ్చింది. వాస్త‌వానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో అప్పులు ద‌క్కే ప‌రిస్థితి లేద‌ని .. ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఒక ర‌కంగా ఇరుకున ప‌డింది. కానీ, ఇప్పుడు.. అప్పులు ద‌క్కే ఛాన్స్ రావ‌డం.. ప్ర‌భుత్వ వ‌ర్గాల్లోనూ హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. అదేస‌మ‌యంలో ఉపాధి ప‌నుల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని.. ప‌రిశీల‌న‌కు వ‌చ్చిన కేంద్ర అధికారుల బృందం.. రాష్ట్రం అమ‌లు చేస్తున్న విధానాల‌ను చూసి హ‌ర్షం వ్య‌క్తం చేసింది. అంతేకాదు.. ఏపీ ఇత‌ర ర‌ష్ట్రాల‌కు ఆద‌ర్శ‌మ‌ని.. అధికారులు ఆఫ్ ది రికార్డుగా పేర్కొన్నారు. ఇలా.. మొత్తంగా గ‌డిచిన రెండు రోజుల‌లో జ‌రిగిన ప్ర‌తిప‌రిణామం.. వైసీపీకి ప్ల‌స్ కావ‌డంతో అటు పార్టీలోను.. ఇటు ప్ర‌బుత్వంలోనూ హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.