Begin typing your search above and press return to search.

దేశంలో తగ్గుతున్న కరోనా ... తాజాగా ఎన్ని కేసులంటే..!

By:  Tupaki Desk   |   17 Jun 2021 5:30 AM GMT
దేశంలో తగ్గుతున్న కరోనా  ... తాజాగా ఎన్ని కేసులంటే..!
X
మనదేశంలో కొత్త‌గా 67,208 క‌రోనా వైరస్ మహమ్మారి కేసులు న‌మోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,00,313కు చేరింది. అలాగే, కరోనా మృతుల సంఖ్య మొత్తం 3,81,903 కి చేరింది. మొత్తం 26,55,19,251 మందికి వ్యాక్సిన్లు మొత్తం 38,52,38,220 కరోనా పరీక్షలు నిర్వహించగా యాక్టివ్ కేసులు దేశవ్యాప్తంగా 8,26,740గా ఉన్నాయి. దేశంలో బుధవారం 67,208 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే కరోనా బారిన పడి నిన్న ఒక్కరోజే 1,03,570 మంది కోలుకున్నారు.

దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,00,313కు చేరింది. ఈక్రమంలో దేశవ్యాప్తంగా మరో 2,330 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీనితో మృతుల సంఖ్య మొత్తం 3,81,903కు పెరిగింది. అలాగే, కరోనా నుంచి దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 2,84,91,670 మంది కోలుకున్నారు. 8,26,740 మందికి ఆసుపత్రుల్లోను..అలా కొంతమంది హోం క్వారంటైన్‌ లలో చికిత్స పొందుతున్నారు. అలాగే దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 26,55,19,251 మందికి వ్యాక్సిన్లు వేయించుకున్నట్లుగా తేలింది. దేశంలో నిన్నటి వరకు మొత్తం 38,52,38,220 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. ఈ క్రమంలో బుధవారం ఒక్కరోజే 19,31,249 శాంపిళ్ల పరీక్షలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి క్రమ క్రమంగా పాజిటివ్‌ కేసులు మరింతగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ 15వేలకు మంచి కేసులు నమోదు కావడం లేదు. అత్యధికంగా కేరళ నుంచే వస్తున్నాయి. కేరళలో 13,270, తమిళనాడులో 10,448, మహారాష్ట్రలో 10,107 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది.