Begin typing your search above and press return to search.

భారత్ లో స్వేచ్ఛ తగ్గింది.. అంతర్జాతీయంగా పడిపోయిన ర్యాంకు

By:  Tupaki Desk   |   5 March 2021 5:30 AM GMT
భారత్ లో స్వేచ్ఛ తగ్గింది.. అంతర్జాతీయంగా పడిపోయిన ర్యాంకు
X
మోడీ సర్కారుకు మచ్చలా నిలిచే అంతర్జాతీయ నివేదిక వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మోడీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దేశంలో స్వేచ్ఛ తగ్గిపోయిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 211 దేశాల్లో మన ర్యాంకు తాజాగా మరింత పడిపోవటం గమనార్హం. ఫ్రీడం హౌస్ సంస్థ నిర్వహించిన అధ్యయనం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీస్తోంది. స్వేచ్ఛా సూచీ ప్రకారం స్కోర్ 100 ఉంటే.. ఆ దేశంలో స్వేచ్ఛ ఉన్నట్లు. కానీ.. భారత్ లో ఇది అంతకంతకూ తగ్గుతున్న విషయాన్ని సర్వే చేసిన సంస్థ వెల్లడించింది.

గతంలో 83 ర్యాంకు ఉన్న దాని స్థానే.. ఇప్పుడు 88కి పడిపోయిన వైనం తెర మీదకు వచ్చింది. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వేచ్ఛ మరింత తగ్గిన విషయాన్ని చెబుతున్నారు. వాషింగ్టన్ కేంద్రంగా పని చేసే ఫ్రీడం హౌస్ అనే మేధో బృందం అనేక అంశాల్ని పరిశీలించి.. ఈ స్కోరును నిర్దేశిస్తోంది.

అత్యంత స్వేచ్ఛాయుత దేశాలుగా ఫిన్లాండ్.. నార్వే.. స్వీడన్ లు రాగా.. కేవలం ఒక్కటంటే ఒక్కటే స్కోర్ ఉన్న టిబెట్.. సిరియాలు ఈ పట్టికలో అట్టడుగున ఉన్నాయి. అదే సమయంలో 211 దేశాల్లో మన ర్యాంకు 83 నుంచి 88కి పడిపోయింది. 2014లో మోడీ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి పౌరహక్కుల అణచివేత అంతకంతకూ పెరుగుతూ ఉందని చెబుతున్నారు.

తాజా నివేదికలో భారత్ స్థాయిని స్వేచ్ఛాయుత నుంచి పాక్షిక స్వేచ్ఛాయుత దేశంగా తగ్గించటం.. ప్రపంచంలో 20 శాతం మంది ప్రజలు మాత్రమే అన్ని అంశాల్లో పూర్తి స్వేచ్ఛను కలిగి ఉన్నట్లుగాఈ నివేదిక వెల్లడిస్తుంది. దీని వివరాలు మోడీ భక్తులకు అంతగా రుచించవేమో. మోడీ లాంటి దేవుడు దేశాన్ని పాలిస్తున్న వేళ.. ఇలా మచ్చ వేస్తారా? దీని వెనుక ఏదో అంతర్జాతీయ కుట్ర ఉందంటూ కొత్త సైద్ధాంతీకరణ చేస్తారేమో? ఏమైనా.. ఈనివేదిక మోడీ భక్తులకు ఏ మాత్రం మింగుడుపడనిదిగా ఉంటుందని చెప్పక తప్పదు.