వామ్మో ఇదెక్కడి కిలేడీ లేడీ రా నాయన.. ఆరుగురిని పెళ్లాడి మోసం!

Sat Sep 24 2022 18:13:33 GMT+0530 (India Standard Time)

Fraud by marrying six people

తమిళనాడులో కిలేడీ లేడీ వ్యవహారం బట్టబయలైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు పెళ్లిళ్లు చేసుకుని పెళ్లి కొడుకులను పెళ్లి చేసుకుని ఏడో వివాహం చేసుకుంటుండగా దొరికిపోయిన మాయలేడీ వ్యవహారం సంచలనం సృష్టించింది. పెళ్లి చేసుకోవడం.. అతడి రెండు మూడు రోజులు ఉండటం.. అందినకాడికి లక్షల్లో డబ్బు తీసుకుని ఉడాయించడం.. ఇదీ ఈ కిలేడీ పెళ్లి కూతురు వ్యవహారం. ఏడో పెళ్లి చేసుకుంటుండగా దొరికిపోయి కటకటాలపాలైంది.ఈ సంచలన ఘటన వ్యవహారాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని నమ్మక్కల్ జిల్లాలోని కల్లిపాళయంలో ధనపాల్ అనే యువకుడు ఉంటున్నాడు. అతడు పెళ్లి చేసుకోవాలని చాలాకాలం నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నా ఎక్కడా కుదరడం లేదు. ఈ క్రమంలో పెళ్లిళ్ల బ్రోకర్ బాలమురుగన్ అనే వ్యక్తి అతడికి పరిచయమయ్యాడు. మంచి పిల్ల ఉందని.. ఆమెను ఇచ్చి పెళ్లి చేస్తానని ధనపాల్ కు హామీ ఇచ్చాడు.

తమిళనాడులోని మదురైకి చెందిన సంధ్య అనే యువతిని ధనపాల్ కు చూపించి బ్రోకర్ బాలమురుగన్ పెళ్లి కుదిర్చాడు. ఈ మేరకు సెప్టెంబర్ 7న ఓ గుడిలో సంధ్య ధనపాల్ ల వివాహం జరిగింది. అయితే పెళ్లికి సంధ్య అక్కా బావ అని చెప్పిన ఇద్దరు వ్యక్తులు బ్రోకర్ బాలమురుగన్ మాత్రమే వచ్చారు.

ఇక పెళ్లికొడుకు ధనపాల్ తరఫున అతడి కుటుంబ సభ్యులు బంధువులు చాలా మంది పెళ్లికి వచ్చారు. తనకు పిల్లను కుదిర్చి పెళ్లి చేసినందుకు ధనపాల్ బ్రోకర్‌కు రూ.150 లక్షలు కమీషన్‌గా ఇచ్చాడు. అయితే పెళ్లి అయ్యాక మూడే మూడు రోజులు పెళ్లి కుమార్తె సంధ్య తన భర్త ధనపాల్‌తో కాపురం చేసింది. నాలుగో రోజు చెప్పాపెట్టకుండా భారీ ఎత్తున డబ్బు నగలతో ఉడాయించింది.  

తన భార్య సంధ్య కనిపించకపోవడంతో అప్పటి నుంచి ఆమె కోసం ధనపాల్ చాలా ప్రాంతాల్లో వెతుకులాట సాగించాడు. పెళ్లి కూతురు సంధ్య మాత్రమే కాకుండా ఆమె అక్క బావ అంటూ పెళ్లికి వచ్చినవారు పెళ్లిళ్ల బ్రోకర్ బాలమురుగున్ మాయమయ్యారు. అంతేకాకుండా వారి మొబైల్ ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ వచ్చాయి. ఇక వెతికి వెతికి వారి ఆచూకీ లభించకపోవడంతో ధనపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కాగా పెళ్లిళ్ల బ్రోకర్ బాలమురుగున్.. సంధ్య ఫొటోను ధనపాల్ బంధువుకు చూపించి అతడితో పెళ్లి జరిపించడానికి ప్లాన్ చేశాడు. పెళ్లి తేదీని కూడా ఫిక్స్ చేశారు. దీంతో సంధ్య తన బంధువునే మరో పెళ్లి చేసుకుంటున్నదని ధనపాల్ కు తెలిసింది.

దీంతో ధనపాల్ బంధువులు అతడి కుటుంబ సభ్యులు పెళ్లి జరిగే గుడి వద్దకు వెళ్లి సంధ్య ఆమె అక్కాబావగా చెప్పుకుంటున్న ఇద్దరిని పెళ్లిళ్ల బ్రోకర్ బాలమురుగున్‌ను చితకబాదారు. అంతేకాకుండా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు.

కాగా పోలీసుల విచారణలో దిమ్మతిరిగే వాస్తవాలు బయటికొచ్చాయి. కిలేడీ పెళ్లికూతురు సంధ్య ఇప్పటికే ఆరుగురిని పెళ్లి చేసుకుందని.. ఏడో పెళ్లి చేసుకునే క్రమంలో దొరికిపోయిందని పోలీసులు తెలిపారు. పెళ్లి పేరుతో మోసం చేయడం అందినకాడకి దోచుకోవడమే సంధ్య పని వెల్లడించారు. ఇలా  ఇప్పటికే పెళ్లి కొడుకుల దగ్గర రూ. లక్షల రూపాయలు వసూలు చేసిందని తెలిపారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.