Begin typing your search above and press return to search.

విడాకులివ్వ‌కుండానే నాలుగు పెళ్లిళ్లు.. ప్ర‌భుత్వ టీచ‌ర్ ఘనకార్యం!

By:  Tupaki Desk   |   20 Feb 2021 12:00 PM GMT
విడాకులివ్వ‌కుండానే నాలుగు పెళ్లిళ్లు.. ప్ర‌భుత్వ టీచ‌ర్ ఘనకార్యం!
X
అతనొక ప్రభుత్వ టీచర్ ... నలుగురు విద్యార్ధులకి విద్యాబుద్ధులు చెప్తూ, మంచి మార్గంలో నడిపించాల్సిన గురువు స్థానంలో ఉండి చేయకూడని పని చేశాడు. ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా నలుగురి మహిళల జీవితాలతో ఆడుకున్నాడు. మొద‌టి భార్య‌కు విడాకులివ్వ‌కుండానే, మ‌రో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని క‌ట‌క్ జిల్లాలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే .. 45 ఏళ్ల వ‌య‌సున్న వ్య‌క్తి వృత్తిరీత్యా ప్ర‌భుత్వ టీచ‌ర్‌. ఆయ‌న‌కు తొలిసారి 2001లో వివాహ‌మైంది. ఆమెతో సంసారం చేస్తూనే.. 2009లో మ‌రో మ‌హిళ‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ విష‌యం మొద‌టి భార్య‌కు తెలియ‌కుండా దాచాడు. రెండో భార్య‌తో మూడేండ్లు సంసారం చేసిన త‌ర్వాత ఆమె వ‌ద్ద ఉన్న బంగారు ఆభ‌ర‌ణాలు, ఇత‌ర ఖ‌రీదైన వ‌స్తువుల‌ను దొంగిలించాడు.

మొత్తానికి రెండో భార్య ఫిర్యాదుతో పోలీసులు విచార‌ణ చేప‌ట్టి.. ఆ వ‌స్తువుల‌ను టీచ‌ర్ నుంచి తిరిగి ఇప్పించారు. లాక్‌డౌన్ కాలంలో ఆ ఉపాధ్యాయుడు మ‌రో రెండు వివాహాలు చేసుకున్నాడు. మొద‌టి ఇద్ద‌రు భార్య‌ల‌కు విడాకులివ్వ‌కుండానే మ‌రో ఇద్ద‌రిని వివాహామాడాడు. ఆయ‌న‌కు ఇప్ప‌టికే పెళ్లి అయిన‌ట్లు వీరికి కూడా తెలియ‌దు. నలుగురిని ఒకరికి తెలియకుండా మరొకరిని బాగానే మ్యానేజ్ చేస్తూ వచ్చాడు.

కానీ చేసిన తప్పులు ఎంత కాలం దాగుతాయి. నాలుగో భార్య దగ్గర ఉండగా మూడో భార్యకు విషయం తెలిసింది. అలా మొత్తం గుట్టు రట్టు అయ్యింది. దీనితో త‌మ భ‌ర్త లాక్ ‌డౌన్‌లో మ‌రో ఇద్ద‌రిని వివాహం చేసుకున్నాడ‌ని మొద‌టి ఇద్ద‌రు భార్య‌లు తెలుసుకున్నారు. దీంతో వారు క‌ట‌క్‌లోని మ‌హిళా పోలీసు స్టేష‌న్‌లో గ‌త నెల‌లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు టీచ‌ర్‌ను శుక్ర‌వారం అరెస్టు చేశారు.