Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌కు బీజేపీ ద‌గ్గ‌ర‌వుతోందా...సంకేతాలు ఇవే!

By:  Tupaki Desk   |   20 Aug 2019 10:19 AM GMT
జ‌గ‌న్‌కు బీజేపీ ద‌గ్గ‌ర‌వుతోందా...సంకేతాలు ఇవే!
X
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డితో కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం స‌త్సంబంధాలు పెట్టుకునే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తుందా ? జ‌గ‌న్‌ తో ఘ‌ర్ష‌ణాత్మ‌క వైఖ‌రి కంటే స్నేహ‌పూర్వ‌క ధోర‌ణితోనే ముందుకు వెళితే భ‌విష్య‌త్తులో క‌లిసి వ‌స్తుంద‌న్న ప్లాన్‌ తోనే బీజేపీ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌ కు ఓ కీల‌క ప‌ద‌వి ఇచ్చింది. జ‌గ‌న్‌ ను అంతర్ రాష్ట్రాల మండలి స్థాయీ సంఘం సభ్యునిగా నియమించింది. దేశం మొత్తం మీద బీజేపీయేత‌ర ముఖ్యమంత్రుల్లో కేవ‌లం న‌లుగురికి మాత్ర‌మే ఈ చోటు ద‌క్కింది. వారిలో ఒక‌రు కేంద్రంలో ఎన్డీయేలో భాగ‌స్వామిగా ఉండ‌గా... ఇద్ద‌రు మాత్రం త‌ట‌స్థులుగా ఉన్నారు.

అంత‌రాష్ట్రాల మండ‌లి వివిధ రాష్ట్రాల మ‌ధ్య త‌లెత్తే వివాదాల‌ను ద‌ర్యాప్తు చేసి వాటికి త‌గిన ప‌రిష్కార మార్గాల‌ను సూచిస్తుంది. వీటిని కేంద్ర ప్ర‌భుత్వానికి నివేదిస్తే కేంద్రం ఆ రెండు రాష్ట్రాల మ‌ధ్య స‌మ‌స్య‌ను ఏం చేయాల‌నే దానిపై సామ‌ర‌స్య పూర్వ‌కంగా నిర్ణ‌యం తీసుకుంటుంది. మోడీ వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక ఈ మండ‌లిలో చాలా మార్పులు తీసుకున్నారు. అంత‌కు ముందు వ‌ర‌కు ఈ సంఘానికి ప్ర‌ధాని చైర్మ‌న్‌ గా ఉండేవారు. రాజ్యాంగంలోనూ ప్ర‌ధాని గౌర‌వ చైర్మ‌న్‌ గా ఉంటార‌న్న నిబంధ‌న కూడా ఉంది.

ఈ సారి మోడీ హోం మంత్రిని చైర్మ‌న్‌ గా నియ‌మించారు. ఈ క్ర‌మంలోనే ద‌క్షిణాది రాష్ట్రాల నుంచి జ‌గ‌న్‌ కు ఒక్క‌డికే చోటు ద‌క్క‌డంతో రాజ‌కీయ ప్రాధాన్య‌త సంత‌రించుకున్న‌ట్ల‌య్యింది. ఇటీవ‌ల ఏ ప‌ద‌వి ఇవ్వాల‌న్న బీజేపీ రాజ‌కీయ కోణంలోనే చూస్తోంది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు కాద‌ని మ‌రి జ‌గ‌న్‌ ను తీసుకుంది. యూపీఏ - ఎన్డీయేల‌కు సంబంధం లేకుండా న్యూట్ర‌ల్ గా ఉంటోన్న జ‌గ‌న్‌ - న‌వీన్ ప‌ట్నాయ‌క్‌ కు ఈ సంఘంలో చోటు ద‌క్కింది.

తెలంగాణ మీద కొద్ద రోజులుగా బీజేపీ అధిష్టానం ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెడుతోంది. కేసీఆర్‌ తో పాటు టీఆర్ ఎస్‌ ను టార్గెట్‌ గా చేసుకుని చాపకింద నీరులా దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలోనే కేసీఆర్‌ తో ఎలాగూ అక్క‌డ బీజేపీ శ్రేణులు ఢీ అంటే ఢీ అనేలా ముందుకు వెళుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఏపీ సీఎం జ‌గ‌న్‌ తో భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌తో పాటు ద‌క్షిణాదిలో ఎవ‌రో ఒక సీఎంతో అయినా మంచిగా ముందుకు వెళ్లాల‌న్న వ్యూహాత్మ‌క నిర్ణ‌యంతోనే బీజేపీ జ‌గ‌న్‌ కు చోటు ఇచ్చిన‌ట్టు విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.