పెళ్లిపీటలెక్కబోతున్న నలుగురు కవలలు

Sun Dec 15 2019 23:00:01 GMT+0530 (IST)

Four Kerala sisters who were born on same day to get married

ఐదుగురు ఒకేసారి పుట్టారు. నలుగురు ఆడపిల్లలు.. ఒక మగపిల్లాడు. బరువు తక్కువగా ఉండడంతో బతకడం కష్టమే అన్నారు డాక్టర్లు. కానీ అదృష్టం బాగుంది.. బతికారు.. ఇప్పుడు పెళ్లీడుకొచ్చారు. నలుగురు ఆడపిల్లలకు ఒకేరోజు సంబంధం ఖాయం చేశారు. ఏప్రిల్ 26న ఈ నలుగురు కవలల పెళ్లి కేరళలోని గురువాయూర్ లోని శ్రీకృష్ణ దేవాలయంలో జరగబోతోంది.కేరళకు చెందిన ఉత్రా ఉత్రజా ఉతరా ఉతమాల పెళ్లి ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. ఈ నలుగురు కవలల పిల్లలతోపాటు పుట్టిన బాబును సాకే ఆర్థిక స్థోమత లేక వీరి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబ భారమంతా వారి తల్లి రెమాదేవిపై పడింది. వీరి దీనస్థితిని చూసి ప్రభుత్వం రెమాదేవికి బ్యాంకులో ఉద్యోగం ఇచ్చింది. దీంతో ఆ తల్లి ఈ ఐదుగురు పిల్లలను పెద్ద చేసి పెళ్లి సంబంధాలు చూసింది. ఇప్పుడు వీరి పెళ్లి చేయబోతోంది.

అసలు బతకడమే కష్టమనుకున్న కవలలు ఇప్పుడు పెళ్లి వరకూ వచ్చారు. ఆ తల్లి ఆనందం అంతా ఇంతాకాదు. ఆ నలుగురు కవలల పెళ్లి కూడా ఒకేరోజు జరగబోతోంది. ఈ సందర్భంగా ఆ నలుగురి కవలల ఫొటోలు వైరల్ అవుతున్నాయి.