Begin typing your search above and press return to search.

బంగారం లాంటి అవకాశాన్ని వదులుకుంటున్నారా ?

By:  Tupaki Desk   |   24 July 2021 5:32 AM GMT
బంగారం లాంటి అవకాశాన్ని వదులుకుంటున్నారా ?
X
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బంగారం లాంటి అవకాశాన్ని చేజేతులారా పొగోట్టుకుంటున్నారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో రాజీనామాలు చేయాలని డిసైడ్ అయినపుడు వెంటనే రాజీనామాలు చేయిస్తే సరిపోయేది. అలాకాకుండా రాజీనామాలు చేయటానికి సిద్దమని ప్రకటించటం వల్ల ఎలాంటి ఉపయోగంలేదు. ఎందుకంటే చంద్రబాబు ప్రకటనను జనాలు నమ్మేస్ధితిలో లేరు. గతంలో ప్రత్యేకహోదా విషయంలో కూడా ముందు ఎంపిల రాజీనామాకు ప్రకటించి తర్వాత వెనక్కు తగ్గిన విషయం అందరికీ గర్తుండే ఉంటుంది. ఇపుడు గనుక టీడీపీ ఎంపిలతో రాజీనామాలు చేయిస్తే వెంటనే వైసీపీ ఎంపీలపైన ఒత్తిడి పెరిగిపోతోంది.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు వ్యతిరేకంగా అవసరమైతే రాజీనామాలు చేయటానికి తమ ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి కన్వీనర్ కు చంద్రబాబు తాజాగా లేఖ రాయటమే ఆశ్చర్యంగా ఉంది. విశాఖ ఉక్కుపై కేంద్రం నిర్ణయానికి చాలా రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ విషయంలో ఎప్పుడు కూడా చంద్రబాబు ఈ విధంగా స్పందించలేదు. లేఖ రాయటంతో సరిపెట్టకుండా వెంటనే రాజీనామాలు చేయిస్తే చంద్రబాబు చిత్తశుద్దిని జనాలు నమ్ముతారు.

అయతే తాజా పరిణామాల ప్రకారం తెలుస్తున్నదేమంటే ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించటానికి కేంద్రం నూరుశాతం రెడీ అయిపోయింది. ఫ్యాక్టరీలో నుండి కేంద్రం తన వాటాను ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉందని రెండు రోజుల క్రితమే పార్లమెంటులో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి స్పష్టంగా ప్రకటించారు. ఆరు నూరైనా ఉక్కు ఫ్యాక్టరి ప్రైవేటీకరణ ఆగదన్న విషయం అందరికీ తెలుసు.

గడచిన నాలుగు నెలలుగా ఆందోళనలు జరుగుతున్నా చంద్రబాబు అండ్ కో ఎప్పుడు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తునే మాట్లాడారు. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణలో కేంద్రంతో జగన్ కుమ్మక్కయ్యారని, ఫ్యాక్టరీ భూములను దోచుకుంటున్నారని ఇలా నోటికొచ్చినట్లు ఆరోపణలు చేశారు. పార్లమెంటులో గడచిన నాలుగు రోజులుగా వైసీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనల్లో ఉక్కు ఫ్యాక్టరీ అంశం కూడా ఉంది.

ఎలాంటి ఆందోళనలకైనా సిద్ధమైని, రాజీనామాలకు కూడా వెనకాడేది లేదని ఇపుడు ప్రకటించిన చంద్రబాబు మరి పార్లమెంటులో ఆందోళనలు చేస్తున్న వైసీపీ ఎంపిలతో ఎందుకు కలవలేదు ? విశాఖ ఉక్కు అన్నది నూరుశాతం కేంద్రసంస్ధ. కాబట్టి తనిష్టం వచ్చిన నిర్ణయం తీసుకుంటుందన్న విషయం తెలిసికూడా కావాలనే జగన్ పై ఇంతకాలం బురదచల్లేశారు. ప్రైవేటీకరణ ఆపటానికి ఎవరెంత గట్టిగా ఆందోళనలు చేసినా ఉపయోగం లేదన్న విషయం బాగా తెలిసిన తర్వాతే చంద్రబాబు రాజీనామాలకు సిద్ధమనే లేఖ రాశారు.

నిజంగానే రాజీనామాల విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే తమ ఎంఎల్ఏ గంటా శ్రీనివాస్ రాజీనామా చేసినట్లు ఎందుకు చేయించలేదు. పైగా ఆందోళనలకు జగన్ నాయకత్వం వహించాలని ఉచిత సలహా ఇవ్వటమే విచిత్రంగా ఉంది. ఇప్పటికే వైసీపీ ఎంపిలు పార్లమెంటులో ఆందోళనలు చేస్తున్న విషయం చంద్రబాబుకు తెలీదా ? వైసీపీ ఎంపిలు ఆందోళనలు చేస్తున్నా టీడీపీ ఎంపిలు మాత్రం అడ్రస్ లేరు.

తమ ప్రజాప్రతనిధులని చంద్రబాబు అన్నారే కానీ ఎంపిలా ? లేకపోతే ఎంఎల్ఏలా అన్న విషయంలో క్లారిటి ఇవ్వలేదు. విషయం కేంద్రానికి సంబంధించిది కాబట్టి ఎంపిలనే అనుకోవాలి. అయితే ప్రత్యేకహోదా విషయంలో గతంలో టీడీపీ కలిసిరాకపోయినా తమ ఎంపిలతో జగన్ రాజీనామాలు చేయించిన విషయం అందరికీ గుర్తుండేఉంటుంది. మరదే పద్దతిని ఇపుడు చంద్రబాబు కూడా ఎందుకు కంటిన్యు చేయకూడదు. వైసీపీతో సంబంధంలేకుండానే తమ ఎంపిలతో రాజీనామాలు చేయిస్తేనే చంద్రబాబులో చిత్తశుద్ది ఉందని జనాలు అనుకుంటారు. లేకపోతే ఇదికూడా డ్రామాగానే జనాలు కొట్టిపారేస్తారంతే.