వీడియో నాటు నాటు స్టెప్స్ తో ఫుట్ బాల్ వరల్డ్ కప్ ప్రమోషన్

Sun Dec 04 2022 12:06:45 GMT+0530 (India Standard Time)

Football World Cup Promotion With RRR Natu Natu Steps

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఫీవర్ నెలకొంది. సోషల్ మీడియాలో ఫుల్ బాల్ వరల్డ్ కప్ కి సంబంధించిన వీడియోలు.. మీమ్స్ ఇలా ఎన్నో వైరల్ అవుతూనే ఉన్నాయి. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫుట్ బాల్ వరల్డ్ కప్ గురించి మీమ్స్ ను చూస్తూ ఉన్నాం.తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా యొక్క నాటు నాటు సినిమా పాటను కూడా ఫుట్ బాల్ వరల్డ్ కప్ యొక్క ప్రమోషన్ కోసం వినియోగించారు. నాటు నాటు స్టెప్పులతో ఫుట్ బాల్ వీడియోను క్రియేట్ చేసి వైరల్ చేశారు. నెట్ ఫ్లిక్స్ వారు ఈ వీడియోను షేర్ చేశారు.

నాటు నాటు స్టెప్పు మాత్రమే కాకుండా అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో సినిమాలో వేసిన స్టెప్ ను కూడా ఉపయోగించి ఫుట్ బాల్ ప్రమోషనల్ వీడియోను క్రియేట్ చేసి జీ5 షేర్ చేశారు. మొత్తానికి అంతర్జాతీయ స్థాయి గేమ్ ఈవెంట్ కు మన తెలుగు సినిమాల యొక్క హీరోల డాన్స్ మూమెంట్స్ ను వినియోగించడం గొప్ప విషయం అంటూ టాక్ వినిపిస్తుంది.

ఇంకా ఫుట్ బాల్ వరల్డ్ కప్ యొక్క వీడియోలు మరియు మీమ్స్ సోషల్ మీడియా ను ముంచెత్తుతున్నాయి. కానీ ఈ రెండు వీడియోలు మాత్రం కాస్త ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫన్నీగా ఉన్నాయే అంటూ చాలా మంది ఈ వీడియోలను షేర్ చేస్తూ ఉన్నారు.