ఫ్లాష్: బీజేపీలో చేరిన ఈటల

Mon Jun 14 2021 12:33:41 GMT+0530 (IST)

Flash: etela who joined BJP

ఊగిసలాటకు తెరదించుతూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కమలదళంలో అధికారికంగా చేరారు. ఈటల తనతోపాటు తెలంగాణ నుంచి పలువురు కీలక నేతలను కూడా ఢిల్లీకి తీసుకెళ్లి బీజేపీలో చేర్పించారు.ఢిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో ఈటల రాజేందర్ కాషాయ కండువా కప్పుకున్నారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ ఆర్టీసీ కార్మిక సంఘ నేత అశ్వత్థామరెడ్డి సహా పలువురు బీజేపీలో చేరారు.

ఈటలకు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమానికి హుజూరాబాద్ నుంచి ఈటల అభిమానులు తరలివచ్చారు. మరికాసేపట్లోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈటల రాజేందర్ భేటి కానున్నట్లు తెలుస్తోంది.