అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కాల్పులు

Mon Aug 10 2020 09:45:46 GMT+0530 (IST)

Firing during party in Washington DC

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఈ కాల్పులు జరిగాయి. ఈ దుర్ఘటనలో ఒక యువకుడు చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. క్రిస్టోఫర్ బ్రౌన్ అనే 17 ఏళ్లు యువకుడిగా గుర్తించారు.ఈ కాల్పుల్లో మరో 19మంది తీవ్రంగా గాయపడ్డారు. రాత్రి 12.20 గంటల సమయంలో గుమిగూడి ఉన్న వారి మీద ఎవరో గుర్తుతెలియని దుండగుడు పలుమార్లు కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు.

ఇక ఓ పోలీస్ అధికారి కూడా ఈ కాల్పుల్లో గాయపడింది. ఆమె పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇక మిగిలిన వారికి ప్రాణనష్టం వాటిల్లేలా బులెట్స్ తగలలేదు.

ఫుడ్ మ్యూజిక్ పెట్టుకొని కొందరు గుమిగూడి ఉన్నప్పుడు ఈ కాల్పులు జరిగినట్టు పోలీసులు చెప్పారు. సామూహిక వేడుకపై ఈ కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపింది ఎవరనేది తెలియాల్సి ఉంది.