Begin typing your search above and press return to search.

వైసీపీకి ఫైర్ బ్రాండ్లు త‌గ్గిపోయారు.. రీజ‌న్ ఇదేనా...?

By:  Tupaki Desk   |   7 Feb 2023 7:00 PM GMT
వైసీపీకి ఫైర్ బ్రాండ్లు త‌గ్గిపోయారు.. రీజ‌న్ ఇదేనా...?
X
ఫైర్ బ్రాండ్ నాయ‌కుల‌కు కేరాఫ్‌.. వైసీపీ! ఉత్త‌రాంధ్ర నుంచి సీమ వ‌ర‌కు.. ప్ర‌తి జిల్లాలోనూ వైసీపీకి ఒక‌రో ఇద్ద‌రో ఫైర్ బ్రాండ్ నాయ‌కులు ఉన్నారు. పార్టీపై ఎవ‌రు ఎలాంటి కామెంట్ చేసినా.. వెంట‌నే రియాక్ట్ కావడం.. ఆవెంట‌నే కౌంట‌ర్ ఇవ్వ‌డం.. ఈ నేత‌ల‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. పార్టీని అధికారంలోకి తీసుకువ చ్చేందుకు.. త‌ర్వాత‌.. ప్ర‌బుత్వంపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు చెక్ పెట్టేందుకు కూడా ఈ ఫైర్ బ్రాండ్లు ఎంతో కృషి చేశారు.

వీరిలో కొడాలి నాని, మంత్రి రోజా, గుడివాడ అమ‌ర్నాథ్‌, దువ్వాడ శ్రీను, అంబ‌టి రాంబాబు, జోగి ర‌మేష్‌, శ్రీకాంత్‌రెడ్డి, అనిల్ యాద‌వ్‌.. ఇలా అనేక మంది ఉన్నారు. అయితే.. ఇప్పుడు వీరు సైలెంట్ అయిపో యారు. గ‌త కొన్నాళ్లుగా పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఒక‌వైపు అంత‌ర్గ‌తంగా పార్టీలో కుమ్ములా ట‌లు పెరిగిపోయాయి. మ‌రోవైపు.. ప్ర‌తిప‌క్షం నుంచి కూడా దాడి ఒక రేంజ్‌లో సాగుతోంది.

ఇలాంటి ప‌రిణామాలు జ‌రిగిన‌ప్పుడు.. గ‌తంలో వెంట‌నే రియాక్ట్ అయి.. వాటికి కౌంట‌ర్లు ఇచ్చిన నాయ‌కు లు ఇప్పుడు మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు. ఎవ‌రికి వారు త‌మ‌ను ఏదైనా ఎవ‌రైనా అంటే.. త‌ప్ప‌.. స్పందించ‌డం లేదు. రోజాను ప‌వ‌న్ క‌ళ్యాణ్ కామెంట్ చేస్తే.. ఆమె మాత్ర‌మే స్పందిస్తున్నారు. ఇక‌, జ‌గ‌న్‌ను అన్నా కూడా ఒక‌రిద్దరు మాత్ర‌మే స్పందిస్తున్నారు. ఇంకొంద‌రు చాలా వ‌ర‌కు సైలెంట్‌గా ఉంటున్నారు.

కానీ, ఈ ప‌రిస్థితి మునుపు లేదు. అందరూ ఆ చివ‌రినుంచి ఈ చివ‌రి వ‌ర‌కు కూడా పెద్ద ఎత్తున విరుచుకు పడేవారు. దీనికి ఇప్పుడు ఎందుకు ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చింది? అనేది ఆస‌క్తిగా మారింది. ఎవరికి వారు త‌మ‌ను తాము జాగ్ర‌త్త చేసుకుంటున్నారేమో.. నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ‌కు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం వ‌ల్ల‌.. ప్ర‌యోజ‌నంపై దృష్టి పెట్టారేమో.. మెజారిటీ ప్ర‌జ‌లు త‌మ‌ను గ‌మ‌నిస్తున్నార‌ని.. అనుకుంటున్నారేమో.. అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. అందుకే .. ఎవ‌రికి వారు త‌మ ఇల్లు చ‌క్క పెట్టుకునే ప‌నిలో ఉన్నార‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.