Begin typing your search above and press return to search.

క్లబ్ లు, సినిమా హాళ్లలో అగ్నిమాపక సిబ్బంది దాడులు

By:  Tupaki Desk   |   18 Jan 2022 4:30 PM GMT
క్లబ్ లు, సినిమా హాళ్లలో అగ్నిమాపక సిబ్బంది దాడులు
X
సికింద్రాబాద్ క్లబ్ అగ్నికి ఆహుతి కావడంతో తెలంగాణ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. అగ్నిమాపక చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని క్లబ్ లలో.. సినిమా హాళ్లలో.. షాపింగ్ మాల్స్ లలో తనిఖీలు చేస్తున్నట్లు తెలంగాణ సెంట్రల్ రీజినల్ అగ్నిమాపక శాఖ ఆఫీసర్ పాపయ్య వెల్లడించారు.

సికింద్రాబాద్ క్లబ్ అగ్ని ప్రమాదం ఘటన తర్వాత హైదరాబాద్ లోని అన్ని క్లబ్ లలో తనిఖీలు చేపడుతున్నామని పాపయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25కు పైగా క్లబ్ లు ఉన్నాయని.. నిన్న 15 క్లబ్ లలో తనిఖీలు నిర్వహించామన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయని.. ఈరోజు.. రేపు తనిఖీలు నిర్వహించిన తర్వాత పూర్తి నివేదిక వస్తుందని ఆయన పేర్కొన్నారు.

సికింద్రాబాద్ క్లబ్ కంటోన్మెంట్ పరిధిలో ఉందని.. 6 మీటర్ హైట్ లేదా 500 స్వ్కేర్ మీటర్లు ప్లాట్ ఏరియా ఉంటే ఫైర్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ నుంచి ఎన్.వోసీ తీసుకోవాలని సూచించారు. ఫైర్ డిపార్ట్ మెంట్ నుంచి సికింద్రాబాద్ క్లబ్ ఎన్.వోసీని తీసుకోలేదని.. సికింద్రాబాద్ క్లబ్ లో కొన్ని ఫైర్ ఎక్విప్మెంట్ మాత్రమే ఉన్నాయని.. మరికొన్ని లేవని ఆయన వెల్లడించారు.

చట్టప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని.. నిన్న జరిపిన తనిఖీల్లో కొన్ని క్లబుల్లో ఫైర్ ఎక్విప్ మెంట్ పెడుతున్నారు కానీ కొన్ని ఆపరేషన్ లో లేవని ఆయన తెలిపారు. చిన్న చిన్న లోపాలు ఉన్నాయని.. వాటిని సరిచేసుకోవాలని సూచించామన్నారు.