Begin typing your search above and press return to search.

యూపీ ఎన్నిక‌ల్లో ఆ రెండు పార్టీల మ‌ధ్యే ఫైటా?!

By:  Tupaki Desk   |   20 Jan 2022 4:17 PM GMT
యూపీ ఎన్నిక‌ల్లో ఆ రెండు పార్టీల మ‌ధ్యే ఫైటా?!
X
అతి పెద్ద రాష్ట్రం ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి. అయితే.. ఈ రాష్ట్రంల్లో ప్రాంతీయ‌, జాతీయ పార్టీల‌కు కొద‌వ‌లేదు. ఎస్పీ, బీఎస్పీ వంటి ప్రాంతీయ,, జాతీయ పార్టీలు.. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలు, ఎంఐఎం వంటి హైద‌రాబాద్ పార్టీ కూడా పోటీ చేస్తున్నాయి. అయితే.. గ‌త ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి ఎన్నిక‌ల‌కు మ‌ధ్య చాలా వ్య‌త్యాసం క‌నిపిస్తోంది. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి ఆ పార్టీ.. దూకుడుగా ముందుకు సాగిన ప‌రిస్థితి క‌నిపించింది. దీంతో ఓటు బ్యాంకు చీలిక‌లు ఎక్కువ‌గా క‌నిపించేవి.

అంటే.. అధికారంలోకి వ‌చ్చే పార్టీకి ఓటు బ్యాంకు త‌గ్గినా.. సీట్లు వ‌స్తే చాల‌నే ప‌రిస్థితి ఉండేది. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది.పార్టీలు ఒంట‌రిగా కాకుండా.. ఏదొ ఒక పార్టీకి అనుబంధంగా మారుతున్నా యి. దీంతో పార్టీల దూకుడు క‌నిపించినా.. గ‌తంలో ఉన్న ప్ర‌భావం మాత్రం క‌నిపించ‌డం లేదు. దీంతో ప్ర‌ధానంగా ఎన్నిక‌ల పోటీ రెండు ప‌క్షాల మ‌ధ్యే క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అదే.. అధికార బీజేపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న స‌మాజ్‌వాదీపార్టీ. ఈ రెండు పార్టీలే ఇప్పుడు ముఖాముఖి హోరా హోరీ పోరాడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

గ‌తంలో మాదిరిగా.. ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. వాస్త‌వానికి గ‌తంలో కులాలు, మ‌తాల వారిగా.. పార్టీలు విభ‌జిత పాలిటిక్స్‌కు ప్రాధాన్యం ఇచ్చేవి. అయితే.. ఇప్పుడు ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా కీల‌క‌మైన ప్రాంతీయ పార్టీ బ‌హుజ‌న స‌మాజ్ వాదీ పార్టీ.. బీఎస్పీ.. ఇప్పుడు పోటీకి దూరంగా ఉంది. ఇప్పటికే ఈ పార్టీ అధ్య‌క్షురాలు.. మాయావ‌తి పోటీ చేయ‌న‌ని చెప్పారు.ఇక‌, పార్టీలోనూ కీల‌క నేత‌లు ఎవ‌రూ యాక్టివ్గా ముందుకు సాగ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక‌, కాంగ్రెస్ పార్టీ మ‌రింత దిగ‌జారిపోయిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. రాహుల్ జాడ పోయి.. ప్రియాంక జాడ వ‌చ్చినా.. ఎక్క‌డా ఊపు క‌నిపించ‌డం లేదు.

మ‌రోవైపు.. కొన్ని పార్టీల‌ను ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌ని ప‌రిస్థితి క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇలాంటి వాటిలో హైద‌రాబాద్‌కు చెందిన ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ పార్టీ ఎంఐఎం ముందు వ‌రుస‌లో క‌నిపిస్తోంది. గ‌తంలో బిహార్‌లో పోటీ చేసినా.. మ‌హారాష్ట్ర‌లో పోటీ చేసినా.. ఎన్నోకొన్ని సీట్లు సాధించే ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే.. బిహార్ ఎన్నిక‌ల స‌మ‌యంలోనే.. ఎంఐఎంను.. బీజేపీకి బీ టీం పార్టీగా అభివ‌ర్ణించిన ప‌రిస్థితి క‌నిపించింది.. ఇప్పుడు మ‌రింత‌గా ఆ పార్టీ విష‌యంలో ప్ర‌జ‌లు న‌మ్మ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో వంద స్థానాల్లో పోటీ చేస్తామ‌ని.. ముస్లిం ఓట్ల‌ను గూడ‌గ‌డ‌తామ‌ని.. ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ..ఎంఐఎంకు అనుకున్న మైలేజీ క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇదిలావుంటే.. అధికార బీజేపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఎస్పీకి మ‌ధ్య ఎన్నికల పోరు జోరుగా సాగుతోంది. రోజుకు నాలుగు స‌భ‌లు..ప‌ద‌హారు మీటింగులు అన్న విధంగా నాయ‌కులు జోరుగా ముందుకు సాగుతున్నారు. దీంతో ఇప్పుడు ఎస్పీనా బీజేపీనా? అనే చ‌ర్చే ఎక్కువ‌గా సాగుతుండడం గ‌మ‌నార్హం. మొత్తానికి యూపీ అంటే.. ఒక‌ప్పుడు క‌నిపించిన రాజ‌కీయం నేడు క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.