అంగట్లో చిన్నారి: రూ.22వేలకు బాబు విక్రయం

Sun May 24 2020 21:00:16 GMT+0530 (IST)

Father Sold His Newborn Son For 22 Thousand

అంగట్లో చిన్నారిని రూ.22వేలకు అమ్మానని అంటున్నాడు విక్రేత. కాదు లక్ష రూపాయలు పెట్టి కొన్నానని చెబుతున్నాడు కొనుగోలుదారు. డబ్బుల విషయంలో చెడడంతో ఈ చిన్నారి విక్రయం సంగతి పోలీస్ స్టేషన్ గడప తొక్కింది.హైదరాబాద్ లోని జీడిమెట్లలో రెండు నెలల బాబు విక్రయం కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లాలోని తండాకు చెందిన శేషు అనే వ్యక్తి.. హైదరాబాద్ లోని గాజులరామారంకు చెందిన సింగ్ అనే వ్యక్తికి మగబిడ్డను అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

నిన్న రాత్రి బాబును డబ్బులు తీసుకొని విక్రయించాడు. ఈ క్రమంలోనే డబ్బులకు సంబంధించిన వ్యవహారం ఇద్దరి మధ్య చెడింది. తన బాబును తమకే ఇవ్వాలని పోలీసులను ఆశ్రయించాడు శేషు.

తాను లక్ష రూపాయలు ఇచ్చి కొనుక్కున్నానని సింగ్ అనే వ్యక్తి తెలిపాడు.లేదు తనకు 22వేల రూపాయలు మాత్రమే ఇచ్చాడని శేషు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో పోలీసుల ఎదుట వాదించారు.

అయితే పసిపిల్లల అమ్మకం.. కొనడం తీవ్రనేరం. వీరిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి బిడ్డను తల్లిదగ్గరికి చేర్చేందుకు విచారణ జరుపుతున్నారు.