పార్కింగ్ కోసం ఇకపై ఫాస్టాగ్ !

Tue Sep 14 2021 11:20:40 GMT+0530 (IST)

Fastag no longer for parking

జాతీయ రహదారులు రాష్ట్ర రహదారుల మీద ప్రస్తుతం ఫాస్టాగ్ పద్దతిన టోల్ చెల్లిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఫాస్టాగ్ పద్దతిలో రీఛార్జ్ చేసుకుని టోల్ గేట్ల వద్ద ఎక్కువ సేపు వాహనాలు నిలవకుండా ఉండేందుకు ఈ పద్దతి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం పార్కింగ్ కి కూడా ఫాస్టాగ్ పద్దతిని ఉపయోగించాలని పేటీఎమ్ భావిస్తుంది. ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. పార్కింగ్ లో నిలిపే వాహనాలు ఫాస్టాగ్ పద్దతిలో డబ్బులు చెల్లించే విధానాన్ని తీసుకురానుంది.ప్రయోగాత్మకంగా ఈ సేవలను ఇప్పటికే దిల్లీ మెట్రో పార్కింగ్ స్థలాల్లో ప్రారంభించింది.ద్విచక్రవాహనాల కోసం యూపీఐ ఆధారిత చెల్లింపులను ప్రవేశపెట్టింది. ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు పేటీఎం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సేవల్లో అక్వైరింగ్ బ్యాంక్ గా వ్యవహరించే పేటీఎం కావాల్సిన లావాదేవీలన్నింటినీ పూర్తి చేయనుంది. జూన్ నాటికి కోటి ఫాస్టాగ్ లను జారీ చేసిన తొలి బ్యాంక్ గా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నిలిచింది. జూన్ 2021 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 3.47 కోట్ల ఫాస్టాగ్‌లను జారీ చేశారు. షాపింగ్ మాళ్లు ఆసుపత్రులు విమానాశ్రయాల్లో ఫాస్టాగ్ ఆధారిత పార్కింగ్ సేవలను ప్రారంభించే దిశగా సంబంధిత యంత్రాంగాలతో చర్చిస్తున్నామని పేటీఎం వర్గాలు తెలిపాయి. యూపీఐ ఆధారిత చెల్లింపులను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పద్దతిని దేశవ్యాప్తంగా తీసుకువచ్చేందుకు పేటీఎమ్ సిద్ధం అవుతుంది. ఈ పాస్టాగ్ పార్కింగ్ పద్దతి ఎలాంటి ఫలితాలనిస్తుందో

ఇప్పటికే ఫాస్టాగ్ విధానాన్ని ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) ఆధ్వర్యంలో నడుస్తుంది. దీని వల్ల వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద ఎక్కువ సేపు ఆగకుండా వేగంగా టోల్ ఫీజు చెల్లించవచ్చు. అలాగే చిల్లర కోసం అవస్థలు పడాల్సిన అవసరం కూడా ఉండదు. దీంతో టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీ కూడా తగ్గుతుంది. అయితే ఇకపై ఫాస్టాగ్ తో మెట్రో నగరాల్లో పలు చోట్ల పార్కింగ్ ఫీజును కూడా చెల్లించవచ్చని ఎన్ పీసీఐ తెలిపింది. ఫాస్టాగ్ సహాయంతో నగరాల్లో మాల్స్ ఎయిర్ పోర్టులు తదితర ప్రదేశాల్లో వాహనాల పార్కింగ్ ఫీజు చెల్లించవచ్చు. ఇందుకు గాను ఎన్ పీసీఐ బ్యాంకులు సదరు ప్రదేశాల యాజమాన్యాలతో చర్చిస్తోంది.

ఇక హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇప్పటికే ఫాస్టాగ్‌తో పార్కింగ్ ఫీజు చెల్లించే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇకపై దేశంలోని మిగిలిన మెట్రోపాలిటన్ నగరాల్లోనూ ఇతర ప్రాంతాల్లోనూ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నారు. ఇక మాల్స్ ఎయిర్ పోర్టుల వద్ద ఫాస్టాగ్ ద్వారా పార్కింగ్ ఫీజు చెల్లించేందుకు గాను ఆయా ప్రదేశాల యాజమాన్యాలు బ్యాంకులతో ముందుగా ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వారు ఇప్పటికే ఐసీఐసీఐ సహా 10 బ్యాంకులతో ఇందుకు గాను ఒప్పందాలు చేసుకుంది. ఈ క్రమంలో ఫాస్టాగ్ ద్వారా వాహనదారులు పూర్తిగా కాంటాక్ట్ లెస్ విధానంలో పార్కింగ్ ఫీజును చెల్లించవచ్చు. కోవిడ్ నేపథ్యంలోనే ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామని ఎన్ పీసీఐ తెలిపింది.