Begin typing your search above and press return to search.

సంజయ్ దత్ ను కబళిస్తున్న ‘లంగ్ క్యాన్సర్’ ఎందుకొస్తుంది?

By:  Tupaki Desk   |   13 Aug 2020 1:30 AM GMT
సంజయ్ దత్ ను కబళిస్తున్న ‘లంగ్ క్యాన్సర్’ ఎందుకొస్తుంది?
X
బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కు ఊపిరితిత్తుల క్యాన్సర్( లంగ్ క్యాన్సర్) అని తెలియడంతో అందరూ షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం ఓ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంజయ్ కి ఇటీవల దగ్గు అధికం కావడంతో పరీక్షలు చేయగా ఈ లంగ్ క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది బాధపడేది ఈ లంగ్ క్యాన్సర్ తోనే.. భారత్ లో ఎక్కువమంది చనిపోయేది కూడా ఈ వ్యాధితోనే .. దీంతో ఈ క్యాన్సర్ ఎందుకొస్తుంది? దీని లక్షణాలు ఏంటనేది తెలుసుకుందాం.

లంగ్ క్యాన్సర్ లక్షణాలు తొందరగా బయటపడవు.. చివరి దశలోనే ఈ క్యాన్సర్ నిర్ధారణ అవుతుంది. ఆగకుండా వచ్చే దగ్గు ఈ క్యాన్సర్ కి ఒక ప్రధాన లక్షణం. కనురెప్పలు వాలిపోవడం.. ముఖంలో ఒకవైపు మాత్రమే చెమటపట్టడం లక్షణాలు..

ధూమపానం.. సిగరెట్ పొగాకు తాగడం వల్ల ఈ లంగ్ క్యాన్సర్ కి ప్రధాన కారణం. లంగ్ క్యాన్సర్ వల్ల చనిపోయేవారిలో 80శాతం మందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది. లంగ్ క్యాన్సర్ కు ప్రధాన కారణం పొగతాగడం.. కానీ రాడాన్, ఆస్బెసటాస్, హానికరమైన కెమికల్స్, గాలి కాలుష్యం, ఎక్కువగా పొగ పీల్చడం ద్వారా కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు. ఇక కుటుంబంలో ఎవరికైనా లంగ్ క్యాన్సర్ ఉంటే కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు. ఒక్కోసారి ఎలాంటి సంబంధం లేకుండానే లంగ్ క్యాన్సర్ రావచ్చు.

లంగ్ క్యాన్సర్ కి కీమో థెరపీ, సర్జరీ, రెడియేషన్ థెరిపీ, రేడియో సర్జరీ వంటి చికిత్సలు ఉన్నాయి. 60 సంవత్సరాలు దాటిన వారికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.