Begin typing your search above and press return to search.

కరోనా కాటుకి బలైన ఫెమస్ ప్రొఫెసర్ .. ఎవరో తెలుసా ?

By:  Tupaki Desk   |   15 April 2021 12:30 AM GMT
కరోనా కాటుకి బలైన ఫెమస్ ప్రొఫెసర్ .. ఎవరో తెలుసా ?
X
భారత్ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కరోనా వైరస్ తో పరిస్థితులు ఎంత తీవ్రంగా మారాయో , ఎంత దారుణంగా ఉన్నాయన్న విషయం కళ్లకు కట్టినట్లుగా తెలిపే ఉదంతం తాజాగా చోటుచేసుకుంది. సెకండ్ వేవ్ మొదలైన తర్వాత కేసులు దేశంలో భారీగా పెరిగిపోతున్నాయి. అయితే , దానికి తగ్గట్టు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనితో సామాన్యుల నుండి ప్రముఖుల వరకు అందరూ కరోనా కాటుకి బలైపోతున్నారు. ఆర్థికంగా సంవృద్ధిగా ఉన్నవారు కూడా కరోనా దెబ్బకి కన్నుమూస్తున్నారు అంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. గుజరాత్ కు చెందిన ఇంద్రాణీ బెనర్జీ మరణించిన వైనం తెలిస్తే ఎవరైనా కూడా షాక్ అవ్వాల్సిందే.

ఈ ప్రొఫెసర్ ప్రొఫైల్ మామూలుగా ఉండదు. ఆమె బార్క్ లో ఫెలో కాలిఫోర్నియా వర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్. అలాంటి ఆమె గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీలో నానో సైన్సెస్ విభాగంలో డీన్ గా వ్యవహరిస్తుంటారు. అంత హై ప్రొఫైల్ ప్రొఫసర్ కరోనా పాజిటివ్ గా తేలింది. శ్వాస సమస్య తలెత్తటంతో ఆమెను తొలుత గాంధీ నగర్ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ రద్దీగా ఉండటం, బెడ్లు లేకపోవటంతో ప్రైవేటు ఆసుపత్రికి మార్చారు. అయితే, అక్క ఆక్సిజన్ కాన్సట్రేటర్, వెంటిలేటర్ లేదని చెప్పటంతో సొంత వాహనంలోనే అహ్మదాబాద్ కార్పొరేషన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆ ఆసుపత్రి వారు ఆమెను చేర్చుకోలేదు. దీనికి కారణం ఆమెను అంబులెన్సులో తీసుకురాకపోవడమే. దీనితో మళ్లీ గాంధీనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, కొద్దిసేపటికే ఆమె మరణించారు. అన్ని హంగులు ఉండి కూడా, వైద్యసాయానికి అవసరమైన సదుపాయాలు లేకపోవటంతో ఆమె కరోనా కాటుకి బలైపోయింది. ప్రధాని ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో , ఓ హై లెవెల్ ప్రొఫైల్ ఉండే వ్యక్తికే ట్రీట్మెంట్ అందక చనిపోయారు అంటే , ఇక సాధారణ జనాల పరిస్థితి ఏంటి అని ఆందోళన చెందుతున్నారు.