చంద్రుడ్ని ఢీ కొట్టబోతున్న ఫాల్కన్.. ఎప్పుడంటే?

Thu Jan 27 2022 08:24:58 GMT+0530 (India Standard Time)

Falcon about to hit the moon

అంతరిక్షం.. చాలా అంతుపట్టని అద్భుతాలకు నిలయం. అక్కడ జరిగే ప్రతిదీ  భూమి మీద ఉండే మానవులకు ఆశ్చర్యంగానే ఉంటాయి. అందుకే విశ్వంలో ఉండే చాలా రహస్యాలను ఛేదించాలని ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తుంటాడు. ఇలా చేసి ప్రయోగాలు  కొన్ని విజయవంతం అయితే మరి కొన్ని విఫలం అయిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇలా విఫలం అయినవి కొన్నింటిని భూమి మీద ఉండే సముద్రాల్లో పడేస్తే.. కంట్రోల్ తప్పిపోయనవి కొన్ని అంతరిక్షంలో వ్యర్థ పదార్థాలుగా మిగిలిపోతాయి. ఇలా అంతరిక్ష వ్యర్థంగా మిగిలిపోయిందని శాస్త్రవేత్తలు అందరూ భావించిన ఓ రాకెట్ సడెన్ గా ఓ ఉపగ్రహం వైపుకు దూసుకు వస్తోంది.అదే ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కు చెందిన అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ తయారు చేసి ప్రయోగించిన ఫాల్కన్ 9. ఈ రాకెట్ ను ఏడేళ్ల క్రితం అంటే 2015లో ఈ సంస్థ ప్రయోగించింది. అయితే ఈ రాకెట్ విజయవంతం కాలేకపోయింది. మొదట అందరూ అనుకున్నట్లుగా తొలి దశ విజయవంతం అయినా కానీ తరువాత రెండో దశలో ఈ రాకెట్ విఫలం అయ్యింది. దాని మీద కమాండ్ సాధించేందుకు శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా చివరకు లాభం లేకుండా పోయింది. దీంతో ఆ సంస్థకు సంబంధించి పరిశోధకులు నిపుణులు అందరూ అంతరిక్షంలో వ్యర్థంగా మిగిలిపోయిందని భావించారు. అయితే నాటి నుంచి కూడా ఈ ఫాల్కన్ 9 బూస్టర్ అనేది ఒక క్రమ సాలు అనేది లేకుండా చాలా కక్ష్యల్లో పరిభ్రమిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ దారికి వచ్చినట్లు పరిశోధకులు చెప్తున్నారు.

అయితే ఈ రాకెట్ సరాసరి ఢీ కొట్టబోయే ఉపగ్రహం మరేదో కాదు. భూమి ఉపగ్రహంగా ఉన్న చంద్రుడ్ని. అయితే ఇలాంటివి చాలా అరుదైన ఘటనలు గా చెప్పుకోవచ్చు. అందుకే దీనిని పూర్తి స్థాయిలో పరిశీలించబోతున్నాయి చాలా స్పేస్ కంపెనీలు. ఈ ఫాల్కన్ సుమారు రెండు నెలలు తరువాత చంద్రుడ్ని ఢీ కొట్టనున్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. సుమారు  ఏడు ఏళ్లు తరువాత వస్తున్న ఈ గండం అమెరికా పరిశోధన సంస్థ నాసా గుర్తించింది. అయితే నాసా చెప్తున్న దాని ప్రకారం ఈ ఇది మార్చి నాలుగో తేదీన చంద్రున్ని ముద్దాడబోతుంది. అయితే సుమారు నాలుగు వేల కేజీలకు పైగా ఉన్న ఊ స్పేస్ ఎక్స్ ప్రయోగించిన ఫాల్కన్ గంటకు సుమారు 9 వేల కిలో మీటర్లకు పైగా  వేగంతో వడివడిగా చంద్రుని వైపు దూసుకుపోతుందని చెప్తున్నారు.

అయితే ఈ ఫాల్కన్ చంద్రున్ని ఢీ కొట్టబోయే సమయంలో ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది అనేది ముఖ్యంగా తెలుసుకోనేందుకు భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 2 వేచి చూస్తోందని  భారతీయ అధికారులు తెలిపారు.