Begin typing your search above and press return to search.

ఫేస్ బుక్ హెడ్డాఫీస్‌ ఆ దీవికి మారుతోందా?

By:  Tupaki Desk   |   4 May 2021 9:30 AM GMT
ఫేస్ బుక్ హెడ్డాఫీస్‌ ఆ దీవికి మారుతోందా?
X
సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్ బుక్ ప్ర‌ధాన కార్యాల‌యం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంద‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అయితే.. రాబోయే రోజుల్లో హెడ్డాఫీస్ అక్క‌డి నుంచి షిఫ్ట్ కాబోతోందా? అనే ప్ర‌శ్న‌కు అవును అనే స‌మాధాన‌మే వినిపిస్తోంది. జుక‌ర్ తీసుకుంటున్న ప్ర‌స్తుత నిర్ణ‌యాలు దానికోస‌మేన‌ని చెబుతున్నారు.

ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ హ‌వాయిలోని ఓ ద్వీపంలో తాజాగా.. 600 ఎక‌రాల భూమిని కొనుగోలు చేశారు. ఇందుకోసం 53 మిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చు చేసిన‌ట్టుగా తెలిసింది. ఈ మొత్తం భార‌త క‌రెన్సీలో సుమారు 391 కోట్ల రూపాయ‌లు.

అయితే.. గ‌తంలోనూ జుక‌ర్ ఇక్క‌డ భూమిని కొనుగోలు చేయ‌డం గ‌మ‌నార్హం. అప్పుడు 700 ఎక‌రాల‌ను ఖ‌రీదు చేశారు. దీంతో.. హ‌వాయిలో మొత్తం 1300 ఎక‌రాలు ఆయ‌న పేరుమీద ప‌ట్టా అయ్యింది. మ‌రి, ఇంత పెద్ద మొత్తంలో భూమిని కొనుగోలు చేయాల్సిన అవ‌స‌రం ఏంట‌న్న‌ది ప్ర‌శ్న‌. వ్య‌క్తిగ‌తంగా ఏ ప‌ని చేయాల‌న్నా ఇంత భూమి అవ‌స‌రం లేదు. కాబ‌ట్టి.. ఫేస్ బుక్ హెడ్ ఆఫీస్ ను ఇక్క‌డికి మార్చేందుకే వంద‌లాది ఎక‌రాల‌ను కొనుగోలు చేసిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

ఈ భూమి హ‌వాయిలోని క‌వాయి ద్వీపంలో ఉంది. లార్సెన్స్ బీచ్ కు ఆనుకుని ఈ భూమి ఉంటుంది. స్థానిక కార్పొరేష‌న్ నుంచి ఈ భూమిని కొనుగోలు చేసిన‌ట్టు స‌మాచారం. తొలుత కొనుగోలు చేసిన 700 ఎక‌రాలు ఉత్తర తీరంలో ఉన్నాయి. ఇప్పుడు లార్సెన్ బీచ్ కు స‌మీపంలో భూమిని తీసుకున్నారు.