జగన్ కే పట్టం కట్టేసిన ఎగ్జిట్ పోల్స్!

Sun May 19 2019 19:48:12 GMT+0530 (IST)

Exit Polls Results For Andhra Elections 2019

అనుకున్నదే జరిగింది. అంచనాలే నిజమయ్యాయి. ప్రజల పల్స్ మీద ఇప్పటివరకూ వెలువడిన వార్తలకు తగ్గట్లే ఏపీలో జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీదే ఘన విజయమని తేల్చి చెప్పాలి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఒకప్పటి రాజకీయ నేత లగడపాటి రాజగోపాల్ సర్వే మినహా అత్యధికులు ఏపీకి కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డిగా పేర్కొనటం కనిపించింది.
ఊరంతా ఒక దారి అయితే ఊలిపికట్టది మరో దారి అన్నట్లుగా.. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన వారిలో అత్యధికులు జగన్ పార్టీకి ఘన విజయం ఖాయమని తేల్చాయి. మరో ముఖ్యమైన విషయం ఏమంటే.. ఏపీలో జగన్ పార్టీకి వచ్చే సీట్లపై ఎగ్జిట్ పోల్స్ అంకెలన్ని దాదాపుగా దగ్గరగా ఉండటం.. అసెంబ్లీలో 100కు పైనే సీట్లు ఖాయమని చెప్పగా.. లోక్ సభలో 18 సీట్లకు తగ్గకుండా వస్తాయని చెప్పటం కనిపించింది. వివిధ సంస్థలు పేర్కొన్న ఎగ్జిట్ పోల్స్ ను చూస్తే ఇలా ఉన్నాయి.ఐఎన్ ఎస్ ఎస్(అసెంబ్లీ)

టీడీపీ: 118
వైఎస్సార్ కాంగ్రెస్: 52
జనసేన+:5
కాంగ్రెస్: 0
బీజేపీ:0
ఇతరులు:0

లగడపాటి సర్వే(అసెంబ్లీ)

టీడీపీ: 90-110
వైఎస్సార్ కాంగ్రెస్: 65-79
బీజేపీ: 0
కాంగ్రెస్:0
ఇతరులు: 1-5

లగడపాటి సర్వే(లోక్ సభ)

టీడీపీ: 13-17
వైఎస్సార్ కాంగ్రెస్: 8-12
బీజేపీ: 0
కాంగ్రెస్:0
ఇతరులు: 0-1

ఇండియా టుడే (అసెంబ్లీ)

టీడీపీ: 37-40
వైఎస్సార్ కాంగ్రెస్: 130-135
జనసేన+: 0-1
బీజేపీ: 0
కాంగ్రెస్:0
ఇతరులు:0

ఇండియా టుడే(లోక్ సభ)

టీడీపీ: 4-6
వైఎస్సార్ కాంగ్రెస్: 18-20
బీజేపీ: 0-1
కాంగ్రెస్:0-1
ఇతరులు: 0

న్యూస్ 18 (లోక్ సభ)
టీడీపీ: 10-12
వైఎస్సార్ కాంగ్రెస్: 13-14
బీజేపీ: 0-1
కాంగ్రెస్:0
ఇతరులు:  0

సీపీఎస్ సర్వే(అసెంబ్లీ)

టీడీపీ: 43-44
వైఎస్సార్ కాంగ్రెస్: 130-133
జనసేన:0-1
బీజేపీ: 0
కాంగ్రెస్:0
ఇతరులు:0

వీడీపీ అసోసియేట్స్(అసెంబ్లీ)

టీడీపీ: 54-60
వైఎస్సార్ కాంగ్రెస్: 111-121
జనసేన: 0-4
కాంగ్రెస్: 0
ఇతరులు: 0

ఆరా సర్వే

వైఎస్సార్ కాంగ్రెస్: 126
టీడీపీ:  47
జనసేన: 2

పీపుల్స్ పల్స్ సర్వే (అసెంబ్లీ)

వైఎస్సార్ సీపీకి 112
టీడీపీ 59
జనసేనకు 4

పీపుల్స్ పల్స్ సర్వే (లోక్ సభ)
వైఎస్సార్ సీపీ: 18-21
టీడీపీ: 4-6
జనసేన: 0-1

న్యూస్ ఎక్స్- యూట్యూబ్ (లోక్ సభ)

వైఎస్సార్ కాంగ్రెస్:  20
టీడీపీ: 5

న్యూస్ ప్లాష్ (లోక్ సభ)

వైఎస్సార్ కాంగ్రెస్:  18
టీడీపీ: 7

ద ప్రింట్ (లోక్ సభ)

వైఎస్సార్ కాంగ్రెస్:  13-14
టీడీపీ : 10-12

ఐన్యూస్ (అసెంబ్లీ)

వైఎస్సార్ కాంగ్రెస్: 110-120
టీడీపీ: 55-62
జనసేన: 0-3