ఎగ్జిట్ పోల్స్: యడ్డీ ప్రభుత్వం నిలబడినట్టే?

Sat Dec 07 2019 17:19:55 GMT+0530 (IST)

Exit Polls Favours to Yeddyurappa BJP Government in Karnataka

కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సర్కారును కూలదోసి కుమారస్వామిని గద్దెదించి సీఎం పీఠమెక్కిన బీజేపీ నేత కన్నడ సీఎం యడ్యూరప్పకు గుడ్ న్యూస్ అందించింది. కుమారస్వామిని దించడానికి రాజీనామా చేసిన 15మంది ఎమ్మెల్యేల స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపుపైనే కర్ణాటకలో బీజేపీ సర్కారు భవిత ఆధారపడి ఉంది. ఇటీవల ఇక్కడ ఎన్నికలు ముగిశాయి..దీంతో ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. కర్ణాటకలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు 5న జరిగిన ఉప ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం బీజేపీ మెజార్టీ సీట్లు దక్కించుకుంటాయని తేలింది. కాంగ్రెస్ - జేడీఎస్ లు 3-6 సీట్లు మాత్రమే సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా లేదా అన్నది వేచిచూడాలి.

*ఎగ్జిట్ పోల్స్ అంచనాలివీ..

-పవర్ టీవీ: బీజేపీ 8-12 - కాంగ్రెస్ 3-6 -  జేడీఎస్ 0
-పబ్లిక్ టీవీ: బీజేపీ-8-10 -  కాంగ్రెస్ 3-5 - జేడీఎస్ 1
-బీటీవీ : బీజేపీ 9-11 - కాంగ్రెస్ 2-4 - జేడీఎస్ 2
-సీ ఓటర్: బీజేపీ 12-15 - కాంగ్రెస్ 3 - జేడీఎస్ 0