Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఢిల్లీ టూర్ పై అంత వణుకెందుకు?

By:  Tupaki Desk   |   24 Sep 2021 4:30 AM GMT
కేసీఆర్ ఢిల్లీ టూర్ పై అంత వణుకెందుకు?
X
తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడినా వార్తే.. మాట్లాడకపోయినా వార్తనే.. ఆయన ఏం చేసినా కూడా అందులో ఏదో నిగూఢ అర్థం ఉంటుందని రాజకీయవర్గాల్లో ఓ టాక్ ఉంది. అందుకే కేసీఆర్ చర్యలు ఊహాతీతం అంటుంటారు. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీతో కయ్యం పెట్టుకున్న కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ పెద్దలు మోడీ, అమిత్ షాతో రాసుకుపూసుకు తిరిగి ఇక్కడి బీజేపీ నేతల చెవుల్లో పూలు పెట్టేశాడు. ఇప్పటికే అప్పట్లో కేసీఆర్ ఢిల్లీ టూర్ వేడి తగ్గలేదు. తాజాగా మరోసారి కేసీఆర్ ఢిల్లీ టూర్ ఖాయం కావడం ఆసక్తి రేపుతోంది.

అన్నీ కుదిరితే సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ శుక్రవారం ప్రారంభమవుతుందని అంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి దాదాపు వారం పాటు అక్కడే ఉండి మంత్రాంగం నడిపిన కేసీఆర్ మళ్లీ వెళుతుండడం ఆసక్తి రేపుతోంది. ఢిల్లీ పర్యటనకు ఈనెల 25నుంచి కొనసాగే అవకాశాలున్నాయంటున్నారు.

ఈనెల 26న మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమవేశం ఢిల్లీలో జరుగనుంది. కేంద్రహోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ సమావేశం కానుంది. ఇందులో ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్ ఘడ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని సమాచారం.

ఆదివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ భేటి జరుగనుందని.. అయితే అదొక్కటే కాదని.. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహారం తేల్చుకునేందుకు వెళుతున్నారని మరికొన్ని వర్గాలు ఇన్ సైడ్ గా వ్యాఖ్యానిస్తున్నాయి.

ఈనెల 1న కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. దేశ రాజధానిలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. 3 రోజుల పర్యటన అని.. ఏకంగా వారంపాటు ఉన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షాతో కీలక చర్చలు జరిపారు. కేంద్రమంత్రులను కలిశారు. చాలా రోజులు అక్కడే ఉన్నారు. రెండు వారాలు కాకముందే మరోసారి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తుండడం ఆసక్తి రేపుతోంది.