Begin typing your search above and press return to search.

ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   16 Jun 2021 3:30 PM GMT
ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
X
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి జిల్లాల విభజనపై కీలక వ్యాఖ్యలు చేసినట్టు ప్రధాన మీడియాలో వార్తలు వచ్చాయి. ఎర్రబెల్లి వ్యాఖ్యలతో మరోసారి హన్మకొండ, వరంగల్ జిల్లాల ఏర్పాటు అంశం తెరపైకి వచ్చిందని అంటున్నారు.

హన్మకొండలో విలేకరులతో మాట్లాడిన ఎర్రబెల్లి జిల్లా ప్రస్తావన తెచ్చినట్టు మీడియాలో వార్తలొచ్చాయి. కొత్త జిల్లాల విభజన గురించి ఎర్రబెల్లి ప్రస్తావించడం విశేషం. వరంగల్ లో ఈనెల 21 సీఎం పర్యటించబోతున్నారని.. కాలోజీ హెల్త్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. అలాగే వరంగల్, హన్మకొండ జిల్లాల ఏర్పాటుపై కూడా సీఎం కేసీఆర్ క్లారిటీ ఇస్తారని ఎర్రబెల్లి తెలిపారు.

జిల్లాల విభజనలో ఉమ్మడి వరంగల్ ను ఆరు జిల్లాలుగా ఏర్పాటు చేశారు... వరంగల్ అర్బన్ ను హన్మకొండ అని.. వరంగల్ రూరల్ ను వరంగల్ గా మార్చాలన్న చర్చ సాగింది. దీనిపై ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది.

వరంగల్ రూరల్ కు ఇప్పటికీ జిల్లా హెడ్ క్వార్టర్ ఫైనల్ చేయలేదు. వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని పలు కార్యాలయాల్లోనే రూరల్ జిల్లా కార్యకలాపాలున్నాయి. ఇక అజంజాహిమిల్లు ప్రాంగణంలో వరంగల్ రూరల్ జిల్లా హెడ్ క్వార్టర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినా పలు కారణాలతో వాయిదా పడింది. పరకాల నియోజకవర్గంలోనూ వరంగల్ రూరల్ హెడ్ క్వార్టర్ స్థల సేకరణ చేపట్టే ప్రయత్నం చేసినా అది కార్యరూపం దాల్చలేదు.

ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ వరంగల్ లో పర్యటించి హుజూరాబాద్ కేంద్రంగా 'పీవీ ' జిల్లానా? లేక హన్మకొండ, వరంగల్ జిల్లాలను ఏర్పాటు చేస్తారా? అన్నది వేచిచూడాలి.మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలతో మరోసారి జిల్లాల పేర్ల మార్పుపై చర్చ సాగుతోంది.