Begin typing your search above and press return to search.

ఇంతకాలానికి జ్ఞానోదయం అయ్యిందా ?

By:  Tupaki Desk   |   28 Oct 2021 7:55 AM GMT
ఇంతకాలానికి జ్ఞానోదయం అయ్యిందా ?
X
సోనియా గాంధీ కి ఇన్ని సంవత్సరాల తర్వాత కానీ జ్ఞానోదయం అయినట్లు లేదు. కాంగ్రెస్ పార్టీ లో క్రమశిక్షణ లోపించిందని, నేతల మధ్య ఐకమత్యం లేదని సోనియా చెప్పటమే ఆశ్చర్యం గా ఉంది. ఏ రాజకీయపార్టీ లో అయినా గ్రూపులు, నేతల మధ్య ఆధిపత్యం సహజం గా ఉండేదే. చాలా పార్టీల్లోని నేతలు అధికారం లో ఉన్నపుడు అనేక కారణాల తో గొడవలు పడుతుంటారు. కానీ ప్రతిపక్షం లోకి వచ్చిన తర్వాత చాలా మంది నేతల మధ్య విభేదాలు తాత్కాలికం గా అయినా సర్దుబాటు చేసుకుంటారు.

అధికార పార్టీ పై పోరాటాలు చేయటం లో నేతలం తా ఏకమైపోతారు. గ్రూపులే కాంగ్రెస్ పార్టీ కి బలం, బలహీనత కూడా అని చాలా మందికి తెలిసిందే. పార్టీ లో ఇలాంటి గ్రూపులు దశాబ్దాలు గా ఉన్నదే. దాదాపు 25 ఏళ్ళు గా పార్టీ కి అధ్యక్షురాలి గా పనిచేస్తున్న సోనియా కు పార్టీ లో గ్రూపులున్న విషయం, చాలా మంది నేతల్లో క్రమ శిక్షణ లోపించిందనే విషయాన్ని సోనియా ఇపుడే ప్రస్తావించటం విచిత్రం గా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉన్నా ప్రతిపక్షం లో ఉన్నా నేతల తీరు లో ఎలాంటి మార్పుండదని చాలా సార్లు నిరూపితమైంది.

ఇంకా విచిత్రమేమిటంటే పార్టీ విధానాల ను రాష్ట్ర పార్టీల్లోని నేతలు అర్ధం చేసుకోవటంలేదట. ప్రజా సమస్యల పై నేతలు పోరాటం చేయాల్సిందే అని సోనియా ఇపుడు చెప్పటమే ఆశ్చర్యం గా ఉంది. నేతలు పార్టీ విధానాల ను అర్ధం చేసుకోవటం లేదని ఆడిపోసుకునే బదులు ముందు తన సుపుత్రుడు రాహుల్ గాంధీ వైఖరి ఎంత సీరియస్ గా ఉందో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పార్టీ కార్యక్రమా ల్లో రాహుల్ ఎంత సీరియస్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు ? ఎన్డీయే ప్రభుత్వం తప్పుల పై ఎంత సీరియస్ గా వర్కవుట్ చేస్తున్నారన్నది సోనియా కు తెలీదా ?

బీహార్, పశ్చిమబెంగాల్, ఒడిస్సా అసెంబ్లీ ఎన్నిక ల్లో ఎన్ని నియోజక వర్గాల్లో రాహుల్ ప్రచారం చేశారో సోనియాకు తెలీదా ? బీహార్ ఎన్నికల్లో రాహుల్ మహా అయితే 5 చోట్ల నియోజక వర్గాల్లో మాత్రమే ప్రచారం చేశారు. ఇక బెంగాల్ ఎన్నిక ల్లో అయితే అసలు అడుగే పెట్టలేదు. పార్టీ గెలుపు విషయం లో రాహుల్ కే తగిన శ్రద్ధ లేనపుడు ఇక స్ధానిక నేతల కు మాత్రం ఏముంటుంది ? ఏఐసీసీ ఆదేశాలు పార్టీలో అట్టడుగు స్థాయి కి చేరటం లేదని సోనియా ఇప్పుడు బాధ పడి ఉపయోగం లేదు. ఎందుకంటే అందుకు తనది కూడా బాధ్యత ఉందని సోనియా గ్రహించాలి.

రాష్ట్రాల నుండి వచ్చే నేతల్లో ఎంత మందికి సోనియా సమయం ఇచ్చి మాట్లాడుతున్నారు. సోనియా తో మాట్లాడాలంటే వారాల తరబడి నేతల్లో చాలా మంది ఎదురు చూడాల్సిందే కదా. అధికారం లో ఉన్నప్పుడంటే ఏదోలే అని సరి పెట్టుకోవచ్చు. కానీ ప్రతిపక్షం లో ఉన్నపుడు కూడా ఇదే పద్దతి ఎందుకు సోనియా ఫాలో అవుతున్నారు. నేతల తో సోనియా కు ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత నేతల కు మాత్రం పార్టీ మీద ఎందుకు మక్కువుంటుంది.

నేతల మధ్య వివాదాల ను సరైన సమయం లో పరిష్కరించని కారణం గానే మధ్యప్రదేశ్ లో ప్రభుత్వం కూలిపోయింది. పంజాబ్ లో తాజా గొడవల కు కేవలం సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ లే కారణమని పార్టీ లోనే ఆరోపణలున్నాయి. తప్పుల్లో చాలా వరకు తమ కుటుంబం లోనే పెట్టుకుని నేతలను తప్పు పడితే ఉపయోగం ఏమిటో సోనియా గాంధీనే ఆలోచించాలి.