Begin typing your search above and press return to search.

ఈ మెంటల్​ టార్చర్​ భరించలేం ‘వర్క్ ​ఫ్రం హోం’ ఉద్యోగులు

By:  Tupaki Desk   |   15 Oct 2020 11:30 PM GMT
ఈ మెంటల్​ టార్చర్​ భరించలేం  ‘వర్క్ ​ఫ్రం హోం’ ఉద్యోగులు
X
కరోనా లాక్​డౌన్​తో చాలా కంపెనీలు ‘వర్క్​ ఫ్రం హోం’ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే ఈ పని విధానాన్ని చాలా మంది ఉద్యోగులు ఇష్టపడటం లేదట. వర్క్​ఫ్రంహోంతో తాము మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పనిఒత్తిడి కూడా ఎక్కువగా ఉందని ఉద్యోగులు చెబుతున్నారట. ఈ మేరకు వర్క్​ఫ్రంహోంపై సర్వే నిర్వహించిన ఓ సంస్థ షాకింగ్​ నిజాలు వెల్లడించింది. ప్రస్తుతం కార్పొరేట్‌ కంపెనీలతోపాటు చిన్నా, పెద్ద కంపెనీలన్నీ వర్క్​ఫ్రం హోమ్​నే ఆశ్రయించాయి. లింక్డెన్‌ సంస్థ తాజాగా వర్క్​ఫ్రంహోంపై ఆన్‌లైన్‌ ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ సర్వేలో నిర్వహించింది. వర్క్‌ ఫ్రం హోం విధానంలో పని చేస్తున్న 16,199 మంది ఉద్యోగుల్ని ఈ సంస్థ పలుకరించింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోపనిచేస్తున్న ఉద్యోగులతో మాట్లాడింది. అయింతే వారంతా తాము మానసికంగా ఎంతో ఇబ్బందులు ఎదర్కొంటున్నామని చెప్పారట.

మొదట్లో వర్క్‌ ఫ్రం హోమ్‌ను ఉద్యోగులు ఆనందించారు. తర్వతా వారి ఆశలు ఆవిరయ్యాయి. చాలామందిలో మానసిక సమస్యలు మొదలయ్యాయి. ఆరోగ్యం క్షీణించింది. ఇంట్లోనే ఒక ప్రదేశానికి పరిమితమై ఉండటంతో మానసికంగా వాళ్లు కుంగిపోయారు. ప్రతి ఐదుగురిలో ఇద్దరు.. అంటే 41 శాతం మంది డిప్రెషన్​ కు గురయ్యారు. కంపెనీకి 24 గంటలు అందుబాటులో ఉండాల్సి రావడం.. అర్ధ రాత్రిళ్లు, వారాంతాలు కూడా పనిచేయాల్సిన పరిస్థితులు నెలకొనడాన్ని ఉద్యోగులు ఇబ్బంది గా ఫీలయ్యారు. పని గంటలు పెరిగిపోవడం, నిరంతరాయంగా జరుగుతున్న ఆన్‌ లైన్‌ మీటింగ్‌లతో ఉద్యోగుల పై భారం పెరిగి పోయింది. ప్రతి ముగ్గురి లో ఒకరు తమ వ్యక్తిగత వృద్ధి, జీవితం దెబ్బతిందని భావిస్తున్నారు. 50 శాతం మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోమ్‌ను ఒంటరితనంగా ఫీలవుతున్నారు. వర్కింగ్ మదర్స్​ కూడా తాము ఎంతో ఇబ్బంది పడుతున్నామని చెప్పారట. కేవలం 23 శాతం మంది మాత్రం వర్క్​ ఫ్రం హోమ్​ బానే ఉందని చెప్పారట.