Begin typing your search above and press return to search.

కౌగిలించుకునే ఉద్యోగం.. భారీగా ఆదాయం!

By:  Tupaki Desk   |   18 Jun 2021 12:30 AM GMT
కౌగిలించుకునే ఉద్యోగం.. భారీగా ఆదాయం!
X
మ‌నిషి జీవితం స‌మ‌స్య‌ల మ‌యం. పుట్టింది మొద‌లు చ‌నిపోయే వ‌ర‌కు ఇబ్బందులు కామ‌న్‌. తీవ్ర‌త‌లో తేడా ఉంటుంది త‌ప్ప‌.. క‌ష్టం లేని మ‌నిషే ఉండ‌రు. అయితే.. స‌మ‌స్య ఎక్కువైన‌ప్పుడు మ‌న‌సు సాంత్వ‌న కోరుతుంది. అర్జెంటుగా భారం త‌గ్గించుకోవాల‌ని ఆరాట‌ప‌డుతుంది. ఇదంతా జ‌ర‌గాలంటే.. 'మ‌న‌వాళ్లు' మ‌న వెంట ఉండాలి. వాళ్ల దగ్గర మన గోడు వెళ్లబోసుకొని, వారిని గట్టిగా కౌగిలించుకుని, గాఢంగా శ్వాస తీసుకుంటే.. మనసుకు ఎంతో రిలీఫ్ గా ఉంటుంది.

మాన‌సిక నిపుణులు కూడా ఈ విష‌యాన్ని బ‌లంగా చెబుతుంటారు. మ‌న‌సుకు న‌చ్చిన వారితో, మ‌న‌వాళ్లు అనిపించుకునే స్నేహితుల‌తో గ‌డిపితే.. హృద‌యం ప‌డుతున్న వేద‌న నుంచి విముక్తి దొరుకుతుంద‌ని చెబుతుంటారు. కానీ.. కొంద‌రికి మ‌న‌వాళ్లు అంటూ ఎవ్వ‌రూ ఉండ‌రు. ఒంట‌రిగానే జీవితం వెళ్ల‌దీస్తుంటారు. కావాల్సిన‌వాళ్లున్నా.. ఏదో కార‌ణంతో విడిపోయిన‌వారు కొంద‌రైతే.. నిజంగానే ఎవ్వ‌రూ లేనివారు మ‌రికొంద‌రు. ఇలాంటి వాళ్ల‌కు ఓదార్పు కావాల్సి వ‌స్తే.. వెళ్లి కౌగిలించుకొని, వాళ్ల‌ను ఓదార్చి రావాలి.

ఈ ఉద్యోగాన్నే ప్రొఫెష‌న‌ల్ క‌డ్ల‌ర్స్ అంటారు. ఇప్పుడు ఇది విదేశాల్లో మంచి జాబ్ గా మారింది. ఒత్తిడి, ఆందోళ‌న‌, ఇత‌ర‌త్రా మాన‌సిక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న వారు వీరిని సంప్ర‌దిస్తే.. వెళ్లి కౌగిలించుకొని ఓదార్చి వ‌స్తారు. అయితే.. ఇదంతా ఫ్రీగా కాదు. ఇందుకోసం భారీగా ఛార్జ్ చేస్తారు.

ప్ర‌స్తుతానికి ఇలాంటి అవ‌స‌రం ఇండియాకు రాలేదు. అమెరికాలో మాత్రం పాపుల‌ర్ జాబ్‌. అక్క‌డ రాబిన్ స్టినె అనే మ‌హిళ కౌగిలింత‌లో థెర‌పిస్ట్‌. ఈమె ఆదాయం ల‌క్ష‌ల్లోనే ఉంటుంది. ఈమె త‌ర‌హాలోనే చాలా మంది ఇప్పుడు దీన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. బాధితుల‌కు ఉప‌శ‌మ‌నం.. ఉద్యోగుల‌కు ఉపాధి. భ‌లేగా ఉంది క‌దూ!