ఆ టైంలో చావు భయం వెంటాడింది.. ఎలన్ మస్క్ సంచలన నిజం వెలుగులోకి..

Tue Jan 24 2023 09:03:39 GMT+0530 (India Standard Time)

Elon Musk comments i felt like dying

ఎలోన్ మస్క్ యొక్క ట్వీట్లు ప్రకటనలు తరచుగా వార్తల్లో నిలుస్తాయి.. బిలియనీర్ తరచుగా కొన్ని సమస్యలపై తన అభిప్రాయాలను పంచుకోవడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తాడు. ట్విట్టర్లో తాజా పరిణామాల గురించి ప్రజలను అప్డేట్ చేస్తాడు. నెటిజన్లతో కొంత పరిహాసం చేస్తాడు. ఇటీవల ఎలాన్ మస్క్ రెండవ కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ షాట్ పొందిన తన అనుభవాన్ని పంచుకున్నాడు. టీకా తీసుకున్న తర్వాత తాను "చనిపోతానని భయం వేసిందని.. అంతలా ఆరోగ్యం తీవ్రంగా దిగజారిందని" మస్క్ సంచలన నిజాన్ని బయటపెట్టాడు.కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాల గురించి చేసిన ట్వీట్‌కు ప్రత్యుత్తరం ఇస్తూ మస్క్ తన రెండవ కోవిడ్ బూస్టర్ షాట్‌ను స్వీకరించిన తర్వాత తనకు పెద్ద దుష్ప్రభావాలు కలిగాయని రాసుకొచ్చాడు. "నా రెండవ బూస్టర్ షాట్ తీసుకున్నాక నాకు పెద్ద దుష్ప్రభావాలు వచ్చాయి.  ఆ దెబ్బకు తాను చచ్చిపోతున్నట్లు అనిపించింది. జీవితంలో తొలిసారి భయపడ్డాను ”అని మాస్క్ సీక్రెట్ బయటపెట్టాడు.

మొదటి టీకా తీసుకున్నప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు రాలేదని.. కానీ  రెండవ బూస్టర్ షాట్ ను జర్మనీలోని టెస్లా ప్లాంట్ సందర్శించేందుకు వెళ్లడానికి తీసుకున్నానని.. అప్పుడే దాని వల్ల ఆరోగ్యం దెబ్బ తిని చచ్చిపోతానని భయమేసిందని తెలిపారు.  మరో ట్వీట్లో తన బంధువు మయోకార్డిటిస్‌తో బాధపడుతున్నారని.. ఆసుపత్రిని సందర్శించవలసి వచ్చిందని అందుకోసం కూడా బూస్టర్ డోస్ తీసుకోవాల్సి వచ్చిందన్నారు.  

వ్యాక్సిన్లు రాకముందే తనకు కోవిడ్ సోకిందని అంతకుముందు అది కేవలం 'తేలికపాటి జలుబు' అని మస్క్ వెల్లడించారు. తన చేయి కొద్దిసేపు నొప్పులు రావడం తప్ప ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవన్నారు. మొదటి వ్యాక్సిన్‌ను తీసుకున్నాక తనకు ఎలాంటి దుష్ప్రభావాలు కలగలేదన్నారు. మొదటి బూస్టర్ ఓకే అయితే రెండవది మాత్రం నన్ను చంపేసేలా అనిపించిందని చెప్పాడు.

"వ్యాక్సిన్లు రావడానికి ముందు నాకు కరోనా సోకింది. ఇది ప్రాథమికంగా తేలికపాటి జలుబు. ఆ తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌తో ఎలాంటి చెడు ప్రభావాలు లేవు నా చేతికి కొద్దిసేపు నొప్పి తప్పలేదు. మొదటి ఎంఆర్ఎన్ఏ బూస్టర్ బాగానే ఉంది కానీ రెండవది నన్ను చంపేసేలా చేసింది.. చస్తానని భయమేసిందని మస్క్ తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.