Begin typing your search above and press return to search.

టెస్లాను కొనమని జోబిడెన్‌కి సలహా ఇచ్చిన ఎలన్ మస్క్

By:  Tupaki Desk   |   4 Dec 2022 8:30 AM GMT
టెస్లాను కొనమని జోబిడెన్‌కి సలహా ఇచ్చిన ఎలన్ మస్క్
X
దేశవ్యాప్తంగా 5 లక్షల ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ స్టేషన్‌లను నిర్మించే ప్రణాళికలను అమెరికా అధ్యక్షుడు వెల్లడించడం సంచలనమైంది. ఇది ముఖ్యంగా అమెరికాలో ఎలక్ట్రిక్ వాహనాలకు గొప్ప వరం కానుంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో తోపు అయిన టెస్లా అధినేత ఎలన్ మస్క్ తాజాగా అమెరికా అధ్యక్షుడి ప్రణాళిపై స్పందించాడు. హాట్ కామెంట్స్ చేశాడు. టెస్లాను కొనుగోలు చేయమని ఎలోన్ మస్క్ ఆదివారం జో బిడెన్‌కు సలహా ఇచ్చారు.

35 రాష్ట్రాల్లో స్టేషన్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేస్తూ దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం మొదటి రౌండ్ నిధులను విడుదల చేస్తున్నట్లు బిడెన్ ఇటీవల ప్రకటించారు. "మేము దేశవ్యాప్తంగా 500,000 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్‌లను నిర్మిస్తున్నాము. గొప్ప అమెరికన్ రోడ్ ట్రిప్ పూర్తిగా విద్యుదీకరించబడుతుంది" అని బిడెన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనికి ఎలన్ మస్క్ బదులిచ్చారు: " మీరు టెస్లాను కొనుగోలు చేయవచ్చు" అంటూ దీనికి కౌంటర్ ఇచ్చాడు.

ఈ సంవత్సరం ప్రారంభంలో ఎలన్ మస్క్ తన స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసంగంలో టెస్లా గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన చెందాడు. బిడెన్‌ను ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని మస్క్ చెప్పారు.

ఎలక్ట్రిక్ వాహనాలను నిర్మించడానికి ఫోర్డ్ -జీఎం ద్వారా కలిపి $18 బిలియన్ల పెట్టుబడులను బిడెన్ ప్రచారం చేశారు. అయితే టెస్లా గురించి బిడెన్ దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రస్తావించలేదు.

ఎలన్ మస్క్ తరువాత నేరుగా బిడెన్‌కి ట్వీట్ చేస్తూ, "టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలను నిర్మించడంలో 50,000 అమెరికా ఉద్యోగాలను సృష్టించింది. జీఎం + ఫోర్డ్ కలిపి రెట్టింపు కంటే ఎక్కువ పెట్టుబడి పెడుతోంది" అని చెప్పాడు.

బిడెన్ "అమెరికా ప్రజలను మూర్ఖులలా చూస్తున్నాడు" అని టెస్లా సీఈవో ఆరోపించారు. అయినప్పటికీ, ఈవీల వ్యాపారంలో ప్రపంచానికి ఎలన్ మస్క్ టెస్లా ముందుంది. ఎలన్ మస్క్ విమర్శల నేపథ్యంలో ఈవీ మార్కెట్లో చైనీస్ సవాలును ఎదుర్కోవడానికి దేశం నమ్మకమైన జాతీయ పబ్లిక్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను నిర్మిస్తోందని బిడెన్ ఫిబ్రవరిలో చెప్పారు.

"జిఎమ్.. ఫోర్డ్ వంటి దిగ్గజ కంపెనీల నుండి కొత్త ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని నిర్మించడం నుండి మన దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా వరకు, వినూత్న యువ కంపెనీల వరకు తయారీ దశాబ్దాల తర్వాత అమెరికాకు తిరిగి వస్తోంది" అని జోబిడెన్ తాజాగా స్పందించారు.