Begin typing your search above and press return to search.

గర్ల్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పిన ఎలెన్ మస్క్..: ఎందుకో తెలుసా..?

By:  Tupaki Desk   |   26 Sep 2021 12:30 AM GMT
గర్ల్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పిన ఎలెన్ మస్క్..: ఎందుకో తెలుసా..?
X
ఎలెన్ మస్క్.. ఈ పేరు ఇటీవల బాగా పాపులర్ పొందింది. ఎందుకంటే ప్రపంచ కుబేరుల్లో ఎలెన్ మస్క్ ఒకరు. 151 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రముఖ లగ్గరీ గూడ్స్ లూయిస్ విట్టన్ మోయెట్ కంపెనీ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్డ్ 150 బిలియన్ డాలర్ల నికర విలువతో మూడో స్థానంలో ఉన్నారు. టెస్లా కంపెనీకి అధినేతగా ఉన్న ఎలెన్ మస్క్ తన కార్ల అమ్మకాల్లో కొత్త రికార్డులను సృష్టించాడు. ఇప్పటి వరకు 9 లక్షలకు పైగా కార్లను అమ్మగా ఈ సంఖ్యను 1.3 మిలియన్లకు పెంచేందేకు లక్ష్యంగా పెట్టుకున్నాడు. తన వ్యాపార జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన ఎలెన్ మస్క్ వైవాహిక జీవితం మాత్రం కాస్త తడబడిందనే చెప్పవచ్చు. ఎందుకంటే తాజాగా ఆయన గర్ల్ ఫ్రెండ్ తో విడిపోతున్నట్లు ప్రకటించాడు.

ఎలెన్ మస్క్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో కాదు ప్రముఖ సింగర్ గ్రీమ్స్. ఫేజ్ సిక్స్ అనే పత్రిక ఎలెన్ మస్క్ తన గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ చేసుకున్నట్లు ప్రచురించింది. ‘2018 నుంచి మేం కలిసి డేటింగ్ చేస్తున్నాం.. ఇప్పుడు తామిద్దరం పాక్షికంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. స్పేస్ ఎక్స్ పనులు, టెస్లాకు సంబంధించిన వర్క్ వల్ల విడిపోవాల్సి వచ్చింది ’ ఎలెన్ మస్క్ తెలిపినట్లు పేజ్ సిక్స్ తెలిపింది. ఎలెన్ మస్క్ -గ్రీమ్స్ దంపతులకు ఓ బాబు ఉన్నాడు. అయితే వీరు విడిపోతు బాబు భవిష్యత్తు ఏం గాను అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మళ్లీ ఎవరితో డేటింగ్ చేస్తారని కొందరు మెసేజ్లు పెట్టారు.

అప్ఘాన్ దేశంలో పరిణామాలపై ఇటీవల ఎలెన్ మస్క్ స్పందించారు. తాలిబన్లు మీటింగ్ పెట్టిన సమయంలో ఒక్కరూ కూడా మాస్క్ పెట్టుకోలేదు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి గురించి తెలియదా..? అంటూ తాలిబన్లు గుంపులుగా ఉన్న ఫొటోను షేర్ చేశాడు. అయితే నెటిజన్లు ఎలెన్ మస్క్ పోస్టుకు భిన్నంగా స్పందించారు. నిజమే వారు చెడ్డవారు. అక్కడ వేరియంట్ ఉండదు. ఇంతకు మీరు వ్యాక్సిన్ వేసుకున్నారా..? అని ఓ సైంటిస్టు ఎలెన్ మస్క్ ను ప్రశ్నించారు.

టెస్లా, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడైన ఎలెన్ మస్క్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ను అధిగమించాడు. ఎలెన్ మస్క్ సంపద నికర విలువ జనవరిలో 188.8 బిలియన్ డారల్లు. ఇది ఇండియన్ కరెన్సీలో రూ. 14.13 లక్షల కోట్లు. ఎలెన్ మస్క్ కు దక్షిణాఫ్రికా, కెనడా, అమెరికాలో పౌరసత్వం ఉంది. ఈయన 12 ఏళ్ల వయసులోనే బ్లాస్టర్ అే గేమ్ ను రూపొందించి విక్రయించాడు. అప్పటి నుంచే సొంతంగా రాకెట్ తయారు చేసుకోవాలని కలలు కనేవాడు. అప్పటి నుంచి ఉన్న ఆసక్తితోనే స్పేస్ ఎక్స్ ను స్థాపించాడు. చిన్నప్పుడు ఎక్కువగా మాట్లాడకపోడంతో ఎలెన్ మస్క్ చెవిటి వాడని తన తల్లిదండ్రులు భావించేవారట. టెస్లా కంపెనీ ఎలక్ట్రికల్ కార్లను తయారు చేస్తుంది. ఈ కంపెనీ షేర్ విలువ 811 డాలర్ల గరిష్ట స్థాయికి చేరడంతో అతికొద్ది కాలంలోనే ధనవంతుడయ్యాడు.

ఎలెన్ మస్క్ కు మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొత్తంగా ఆయనకు ఆరుగురు సంతానం. అందరూ అబ్బాయిలో మొన్నటి వరకు గ్రీమ్స్ అనే గర్ల్ ఫ్రెండ్ తో డేటింగ్లో ఉండేవారు. ప్రస్తుతం ఆమెతోనూ విడిపోయినట్లు ప్రకటించాడు. ఎలెన్ మస్క్-గ్రీమ్స్ దంపతులకు ఏడాది కిందట బాబు పుట్టాడు. అతనికి వీరు వింత పేరు పెట్టారు. అయితే గ్రీమ్స్ తో విడిపోయిన తరువాత ఎలెన్ మస్క్ మళ్లీ ఎవరితో ఉంటారన్న విషయాన్ని చెప్పలేదు.