Begin typing your search above and press return to search.

బీహార్​ లో ఎన్నికల్లో పెట్రేగిన హింస..ఎమ్మెల్యే అభ్యర్థిని కాల్చిచంపిన దుండగులు

By:  Tupaki Desk   |   25 Oct 2020 6:30 AM GMT
బీహార్​ లో ఎన్నికల్లో పెట్రేగిన హింస..ఎమ్మెల్యే అభ్యర్థిని కాల్చిచంపిన దుండగులు
X
బీహార్ లో ఒకప్పుడు నిత్యం కల్లోహాలే కనిపించేవి. హత్యలు, కాల్పులు, గొడవలతో జనం ఆందోళనకర పరిస్థితుల్లోనే జీవనం సాగించేవారు. కొంతకాలంగా ఆ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు హింసా కాండను చాలా వరకూ తగ్గించారు. ఇక ప్రశాంతంగా గానే ఉందనుకుంటున్న సమయంలో ఎన్నికల వేళ బీహార్​లో మళ్లీ తీవ్ర అలజడి రేగింది. ఓ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని దుండగులు నడిరోడ్డు మీద కాల్చిచంపారు. ఈ సంఘటన మళ్లీ పాత బీహార్​ ఎన్నికలను తలపించింది. దీంతో రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒకప్పుడు బీహార్​ అంటేనే గొడవలు, హింస.. కానీ నితీశ్​ కుమార్​ సీఎం అయ్యాక ఆ రాష్ట్రం ప్రశాంతంగా మారింది. ఎంతో అభివృద్ధి సాధించింది. కానీ ఈ సారీ ఎన్నికల్లో మాత్రం హింస చెలరేగింది. రోజుకో చోట ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.

హియోర్ జిల్లా హత్‌సర్ వద్ద జనతాదల్​ రాష్ట్రవది పార్టీ అభ్యర్థి నారాయణసింగ్​పై దుండగులు కాల్పులు జరిపారు. అతడి అనుచరులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే నారాయణ్ సింగ్​ చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు. కాల్పులు జరిపిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహర్ ఎన్నికల వేళ కాల్పులు కలకలం రేపాయి. అదీ కూడా ఎమ్మెల్యే అభ్యర్థిపై కాల్పులు జరపడం.. చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ చాలా ఉంది. ఓటింగ్ రోజులు దగ్గరికి వస్తే పరిస్థితి మరింత ఉద్రిక్త పరిస్థితులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాంతి భద్రతల పర్యవేక్షణ పై మరింత దృష్టి పెడితే కానీ అక్కడ పరిస్థితులు సద్దుమణిగే పరిస్థితి నెలకొంది