Begin typing your search above and press return to search.

పరిషత్ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం?

By:  Tupaki Desk   |   19 Jun 2021 7:30 AM GMT
పరిషత్ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం?
X
ఏపీలో హైకోర్టు ఆదేశాలతో అర్ధాంతరంగా రద్దు అయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై తాజాగా ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ ముగిశాక ఎన్నికలనే హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పరిషత్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 126 జడ్పీటీసీ, 2371 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. హైకోర్టు తాజాగా పూర్తిగా ఎన్నికలనే రద్దు చేయడంతో ఈ ఏకగ్రీవాలు కొనసాగుతాయా? లేదా అనే సందేహం మొదలైంది.

అయితే ఎన్నికల సంఘం మాత్రం యాథావిధంగానే ఎన్నికలు కొనసాగుతాయని చెబుతోంది. కేవలం నోటిఫికేషన్ మాత్రమే కోర్టు రద్దు చేసిందని.. ఆనోటిఫికేషన్ తో జరిగిన ఎన్నికలు రద్దు అవుతాయని అంటోంది. ఏకగ్రీవాలకు సంబంధం లేదని ఈసీ వాదిస్తోంది. అయితే మొత్తం ఎన్నికల ప్రక్రియనే రద్దు అయ్యిందన్నది మరో వాదన.

రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఏకగ్రీవాలు చెల్లవని మరో వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లోనూ ఎన్నికల ప్రక్రియ పూర్తికాకపోవడంతో వారంతా అధికారికంగా విధుల్లో చేరే పరిస్థితి లేదన్నది వారి వాదన..

ఇక తాజాగా శాసన మండలిలోనూ 11 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిని ఈసీ భర్తీ చేయాల్సి ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎంపిక కావాలంటే జడ్పీటీసీ, ఎంపీటీసీతోపాటు మున్నిపల్ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిర్లు ఓట్లు వేయాలి. కానీ పరిషత్ ఎన్నికలు రద్దు కావడంతో ఆ ఎమ్మెల్సీ సీట్ల భర్తీ డోలాయమానంలో పడింది. దీంతో ఇలా అన్ని లింకులతో ముడిపడి ఇటు పరిషత్ ఎన్నికలు, అటు ఎమ్మెల్సీ ఎన్నికలు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. పరిషత్ ఎన్నికలకు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలనే ఆదేశం అమలు చేయలేదనే కారణంతోనే ఎస్ఈసీ నీలం సాహ్ని నోటిఫికేషన్ ను హైకోర్టురద్దు చేసింది. దీంతో ఇప్పుడు ఈసీ ఏలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. కోర్టు తీర్పుప్రకారం మరోసారి ఎన్నికలు నిర్వహిస్తుందా? దానిపై సుప్రీంకోర్టుకు ఎక్కుతుందా? అన్నది ఆసక్తి రేపుతోంది.