Begin typing your search above and press return to search.

కొత్త టెన్షన్.. మరోసారి గచ్చిబౌలిలో భూ ప్రకంపనలు

By:  Tupaki Desk   |   19 Oct 2020 7:50 AM GMT
కొత్త టెన్షన్.. మరోసారి గచ్చిబౌలిలో భూ ప్రకంపనలు
X
ఉన్నట్లుండి.. మీ కాలి కింద భూమి ప్రకంపనాలు చోటు చేసుకుంటే.. మీ గుండె వేగం ఎంతలా పెరుగుతుంది? అసలు అలాంటి ఆలోచనే టెన్షన్ పుట్టిస్తుంది. అలాంటిది తరచూ ఇలాంటి ప్రకంపనాలు చోటు చేసుకుంటే పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీ ప్రాంతానికి చెందిన వారు.

మొన్నీ మధ్యనే భూప్రకంపనలు రావటం.. జీహెచ్ఎంసీ.. ఎన్ జీఆర్ఐ శాస్త్రవేత్తలు పరిస్థితుల్ని సమీక్షించటం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా ఇలాంటివి చోటు చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. తరచూ భూ ప్రకంపనాలు చోటు చేసుకుంటున్నా.. అవేమీ ప్రమాదకరమైనవి కావని వారు చెబుతున్నారు. శనివారంఅర్థరాత్రినుంచి ఆదివారం మొత్తంగా 20 సార్లు భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు.

ఇటీవల కాలంలో గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో రిక్టర్ స్కేల్ ను ఏర్పాటుచేశారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శని-ఆదివారాల్లో 20 సార్లు భూమి కంపించినట్లుగా నమోదైందన్నారు. ఇంతకూ గతంలో ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకిలా జరుగుతుందన్న విషయంలోకి వెళితే.. సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా వాన కురిసినప్పుడు భూమిలోకి వెళ్లే వాననీరు.. సర్దుబాటు సమయంలో ఇలాంటివి చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా.. గుట్టలు..రాళ్లు ఉన్న చోట పగుళ్లు.. పొరలు.. రంధ్రాల ద్వారా వర్షపునీరు వెళ్లి.. భూమిలో ఇంకుతుంటాయి. సాధారణ వర్షపాతం అయితే.. అప్పటికే ఉన్నపగళ్లలోకి నీరు వెళ్లి సర్దుకుంటుంది. అధికంగా వర్షపాతం చోటుచేసుకున్నప్పుడు నీరు కొత్త దారుల్ని వెతుకుతూ ఉంటుంది. ఈ సందర్భంలో తాజాగా చోటు చేసుకునే ప్రకంపనాలు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. దీంతో ముప్పు లేదని.. అలా అనిభూకంప లేఖిని మీద 4.5 స్థాయి దాటితే ఇబ్బందే అంటున్నారు.తాజా పరిణామాలు నగరవాసులకు కొత్త టెన్షన్ ను తెప్పిస్తున్నాయని చెప్పక తప్పదు.