Begin typing your search above and press return to search.

స్టార్ హీరో భార్య ఆస్తులు అటాచ్

By:  Tupaki Desk   |   28 May 2023 11:06 AM GMT
స్టార్ హీరో భార్య ఆస్తులు అటాచ్
X
కోలీవుడ్ స్టార్ హీరో ఉద‌య‌నిది స్టాలిన్ స‌తీమ‌ణి కృతిక‌కు చెందిన 36.3 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. ఇటీవ‌ల ఉద‌య‌నిధి స‌న్నిహితుల నివాసాలు.. కార్యాల‌య్యాల్లో ఈడీ సోదాలు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా ఉద‌య‌నిధి సేవా ట్ర‌స్ట్ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు చూసుకుంటున్న కృతిపై ఈడీ దృష్టి సారించిన‌ట్లు తెలుస్తుంది.

ఈ క్ర‌మంలోనే ఆమెపేరిట ఉన్న 36 కోట్ల స్తిరాస్తుల‌ను..34.7 ల‌క్ష‌ల బ్యాంక్ డిపాజిట్ల‌ను అటాచ్ చేసిన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. కేసు ద‌ర్యాప్తులో క‌ల్లాల్ గ్రూప్..యూకే కేంద్రంగా ప‌నిచేసే లైకా గ్రూప్ అనుబంధంగా భార‌త్ లోని లైకా ప్రొడ‌క్ష‌న్స్..లైకా హోట‌ల్స్ లో సోదాలు చేసిన‌ట్లు తెలుస్తోంది. ట్ర‌స్ట్ పేరిట కృతిక ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. ఆ ర‌కంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకి మంచి పేరుంది.

ఇన ఉద‌య‌నిధి న‌టుడిగా..రాజ‌కీయ నాయ‌కుడిగా..వ్యాపార వేత్త‌గా మూడు రంగాల్లోనూ రాణిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఓ వైపు సినిమాలు చేస్తూనే అదే రంగంలో నిర్మాత‌గా..పంపిణీ దారుడిగా కొన‌సాగుతున్నారు. న‌టుడిగా ప‌రిచ‌య‌మైన స‌మ‌యంలోనే సినిమా వ్యాపారంలోకి అడుగు పెట్టారు. ప్ర‌స్తుతం ప‌లు సినిమాల్లో హీరోగా న‌టిస్తున్నారు. అలాగే కొన్ని సినిమాలు నిర్మిస్తున్నారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం `ఇండియ‌న్-2` లోనూ ఉద‌య‌నిధి పెట్టుబ‌డి పెట్టిన‌ట్లు స‌మాచారం.

ఆ మ‌ధ్య ఉద‌య‌నిది సినిమాలు మానేసి పూర్తిగా రాజ‌కీయాల్లోనే బిజీ అవుతార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. ప్ర‌స్తుతం ఆయ‌న తండ్రి ఎమ్.కె స్టాలిన్ ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తుం డ‌టంతో పార్టీకి సంబంధించిన కీల‌క బాధ్య‌త‌లు ఉయ‌ద‌నిధి తీసుకుంటార‌ని ప్ర‌చారం సాగింది. కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. ఇంత‌లోనే ఈడీ సోదాల‌తో స్టాలిన్ కుటుంబం మీడియాలో హైలైట్ అవుతుంది.